అమరావతి కోసం విశాఖ బలి ?

Published : Aug 26, 2017, 02:54 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
అమరావతి కోసం విశాఖ బలి ?

సారాంశం

చంద్రబాబునాయుడు ఆశించినట్లు అమరావతి ప్రాంతానికి పరిశ్రమలు పెద్దగా రాలేదు.   అమరావతి పేరుతో ఎన్ని గ్రాఫిక్స్ చూపించినా ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే, రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్లానే ఇంకా సిద్దం కాలేదు. ఎప్పటికి సిద్ధమవుతుందో తెలీని అమరావతి కన్నా అన్నీ సౌకర్యాలున్న విశాఖపట్నమే మేలని పారిశ్రామికవేత్తలు భావించినట్లున్నారు. అందుకనే అందరూ విశాఖపట్నం చుట్టుపక్కలే భూములు కావాలని అడుగుతున్నారు.

అమరావతి కోసం ప్రభుత్వమే విశాఖపట్నం బ్రాండ్ ను బలి చేస్తున్నట్లుంది. చంద్రబాబునాయుడు ఆశించినట్లు అమరావతి ప్రాంతానికి పరిశ్రమలు పెద్దగా రాలేదు.  అమరావతి పేరుతో ఎన్ని గ్రాఫిక్స్ చూపించినా ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే, రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్లానే ఇంకా సిద్దం కాలేదు. ఎప్పటికి సిద్ధమవుతుందో తెలీని అమరావతి కన్నా అన్నీ సౌకర్యాలున్న విశాఖపట్నమే మేలని పారిశ్రామికవేత్తలు భావించినట్లున్నారు. అందుకనే అందరూ విశాఖపట్నం చుట్టుపక్కలే భూములు కావాలని అడుగుతున్నారు.

అదే విషయాన్ని ఐటి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తావిస్తూ ప్రతీ ఒక్కళ్ళు విశాఖపట్నంలోనే భూములు కావాలంటే సాధ్యం కాదన్నారు.  విశాఖ చుట్టుపక్కల అసలు భూములే లేవని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే అర్ధమేంటి? భవిష్యత్తులో ఎవరికీ విశాఖపట్నం ప్రాంతంలో భూములు ఇచ్చేది లేదనే కదా? అంటే, పరిశ్రమలు పెట్టదలచుకున్న వారు తప్పని సరిగా ప్రభుత్వం ఇచ్చే చోటే భూములు తీసుకోవాలి. ప్రభుత్వం అమరావతిని తప్ప ఇతర ప్రాంతాలను పెద్దగా ప్రమోట్ చేయటం లేదు.

అంటే విశాఖలో ప్రభుత్వం భూములు కేటాయించక, అమరావతికి పరిశ్రమలు రాకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో చంద్రబాబే చెప్పాలి. ఇటీవల విశాఖలో వెలుగుచూసిన భూ కుంభకోణంలో ప్రభుత్వానికి చెందిన వేలాది ఎకరాలను తమ్ముళ్ళే సొంతం చేసేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ప్రభుత్వ భూములన్నింటినీ తమ్ముళ్ళే సొంతం చేసేసుకుంటుంటే పరిశ్రమలకు అవకాశం ఎక్కడుంది? జరుగుతున్న పరిణామాలను బట్టి విశాఖ ప్రాంతానికి పరిశ్రమలు రావటం కల్లే అని స్పష్టమవుతోంది. చూస్తుంటే అమరావతి కోసం ప్రభుత్వమే విశాఖపట్నాన్ని బలి చేస్తున్నట్లుంది.

PREV
click me!

Recommended Stories

Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!
CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu