కాకినాడలో నో ఎంట్రీ ?

First Published Aug 26, 2017, 3:42 PM IST
Highlights
  • కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో లోకేష్ ఇంత వరకూ ఎంట్రీ ఇవ్వలేదు.
  • ఎప్పుడో నంద్యాల ఉపఎన్నికలో ఒకసారి మాత్రమే కనిపించి మాయమైపోయిన లోకేష్ మళ్ళీ నంద్యల వైపు చూడలేదు.
  • లోకేష్ అంటే మామూలు మంత్రి కాదు.
  • పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబునాయుడు కొడుకు, నటసింహం నందమూరి బాలకృష్ణకు స్వయానా అల్లుడు కూడా.
  • ఇన్ని భుజకీర్తులున్న యువకిషోరం ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నట్లబ్బా?

నారా లోకేష్ వ్యవహారం టిడిపిలో పెద్ద చర్చనీయాంశమైపోయింది. ఇంతకీ విషయమేంటంటారా? కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో లోకేష్ ఇంత వరకూ ఎంట్రీ ఇవ్వలేదు. ఎప్పుడో నంద్యాల ఉపఎన్నికలో ఒకసారి మాత్రమే కనిపించి మాయమైపోయిన లోకేష్ మళ్ళీ నంద్యల వైపు చూడలేదు. సరేలే ఏదో పనిలో బిజీగా ఉండి ఉంటాడు అందుకే రాలేకపోయాడని పాపం టిడిపి శ్రేణులు సమాధానం చెప్పుకున్నాయ్. సరే, నంద్యాల ఎన్నికైపోయింది.

అదే సమయంలో కాకినాడ ఎన్నిక వచ్చింది కదా? అక్కడ కూడా లోకేష్ కనబడలేదు ఇంతవరకూ. కారణాలు ఏమైఉంటాయి? అదే ఇపుడు పార్టీలో పెద్ద చర్చనీయాంశమైపోయింది. లోకేష్ అంటే మామూలు మంత్రి కాదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  కీలకమైన ఐటి, పంచాయితీరాజ్ శాఖలకు మంత్రి. చంద్రబాబునాయుడుకు కొడుకు, నటసింహం నందమూరి బాలకృష్ణకు స్వయానా అల్లుడు కూడా. ఇన్ని భుజకీర్తులున్న యువకిషోరం ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నట్లబ్బా? ఆదివారంతో ప్రచారం ముగుస్తోంది. ప్రచారానికి లోకేషే దూరంగా ఉన్నారా? లేక చంద్రబాబే దూరంగా ఉంచారా అన్నది తేలటం లేదు. కారణాలేమైనా గానీ కాకినాడలో లోకేష్ ఎంటర్ కాలేదన్నది వాస్తవం.

click me!