
ఇటీవల వెలగపూడి సచివాలయం నాలుగో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని సమావేశ మందిరంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు సమావేశం జరిగింది. ఈ సమావేశ మందిరం లో ఒక టేబుల్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది. సమావేశంలో అధికారులు అల్పాహారం తీసుకున్నారు. అయితే ఆ పేపర్ ప్లేట్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పై నిర్ల క్ష్యంగా పడేశారని చూపే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తర్వాత ఇది ముఖ్యమంత్రి తీవ్ర అవమానం అంటూ అన్ని ప్రముఖ ఛానల్స్ లో వార్త వచ్చింది. సంచలనం సృష్టించింది. దీని మీద ప్రభుత్వం విచారణ జరిపింది. ఈ సమావేశం జరిగిన హాల్ పక్కనే మీడియా సెల్ ఉంది. సమావేశానికి మీడియాను ఆహ్వానించలేదు. అందువల్ల ఆ రోజు మీడియా రూం కు ముందు వచ్చిన వ్యక్తి ఈ ఫోటో ను చూసి ఉండాలని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ఒక ఛానల్ కెమెరా మెన్ వైపు అందరి వేళ్లూ చూపించాయి.
సచివాలయంలో పని ఉన్న లేకపోయినా అన్ని బ్లాకులకి తిరిగి అన్న ,బాబాయ్ అంటూ అన్ని గదులు తిరిగే వ్యక్తి తెలివిగా అక్కడ పడివున్న ప్లేట్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో మీద అమర్చి వీడియో తీశాడని, సోషల్ మీడియాలోకి వెళ్లి ఫోటోలు ఈ వీడియో ఫుటేజి లోనివేనని విచారణలో తేలిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని టి వి లలో సంచలనం గా చూపించాలని ఆ రిపోర్టర్ ఈ పని చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ సదరు ఛానల్ యాజమాన్య కి ఫిర్యాదు కూడా చేశారు. సచివాలయం లో అతన్ని పిలిచి తీవ్రంగా మందలించినట్లు సమాచారం. ఈ జర్నిలస్టు మీద నిఘా వేసి ఉంచాలని అన్ని శాఖ ల అధికారులను ప్రభుత్వ పెద్దలు హెచ్చరిక కూడా చేశారట.