పంతం నెగ్గించుకొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి: ఏపీలోని మున్సిపాలిటీల చెర్ పర్సన్లు వీరే

By narsimha lodeFirst Published Mar 18, 2021, 11:51 AM IST
Highlights

 అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం నాడు ఎన్నికయ్యారు. 

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం నాడు ఎన్నికయ్యారు. 

తమ పార్టీకి చెందిన 18 మంది కౌన్సిలర్లతో పాటు సీపీఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే క్యాంప్ వెళ్లారు. క్యాంప్ నుండి నేరుగా ఇవాళ ఉదయమే తాడిపత్రి చేరుకొన్నారు.

మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన వారంతా తొలుత ప్రమాణం చేశారు. ఆ తర్వాత చైర్మెన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. తాడిపత్రిలో చోటు చేసుకొన్న రాజకీయ వాతావరణంలో మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక జరిగే సమయంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఇనుప కంచెను ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం సాగినా తాడిపత్రిలో వైసీపీ ప్రభంజనాన్ని అడ్డుకొని టీడీపీ విజయం సాధించడంలో జేసీ కుటుంబం కీలకపాత్ర పోషించింది. సేవ్ తాడిపత్రి నినాదంతో ఈ ఎన్నికల్లో జేసీ కుటుంంబం ప్రచారం నిర్వహించింది.ఈ ప్రచారం టీడీపీకి కలిసి వచ్చింది.

రాష్ట్రంలో మున్సిపల్, కార్పోరేషన్ల చైర్మెన్లు వీరే

ఇచ్ఛాపురం-పి. రాజ్యలక్ష్మి
పాలకొండ-వై. రాధాకుమారి
పలాస-బాల గిరిబాబు
నెల్లిమర్ల-బంగారు సరోజిని
పార్వతీపురం-గౌరీ ఈశ్వరీ
సాలూరు-పి. ఈశ్వరమ్మ
నర్సీపట్నం-ఆదిలక్ష్మి
బొబ్బిలి-వెంకట మురళీకృష్ణారావు
యలమంచిలి-పి. రమకుమారి
అమలాపురం-రెడ్డి సత్య నాగేంద్రమణి
గొల్లప్రోలు-జి. మంగతాయారు
మండపేట-పి.దుర్గారాణి
ముమ్మిడివరం-కె. ప్రవీణ్ కుమార్
పెద్దాపురం-బొడ్డుతులసి మంగతాయారు
పిఠాపురం-జి.సూర్యావతి
రామచంద్రాపురం-జి.శ్రీదేవి
సామలకోట్-గంగిరెడ్డి దేవి
తుని-యేలూరి శ్రీదేవి
జంగారెడ్డి గూడెం-బత్తిన నాగలక్ష్మి
ఏలేశ్వరం-ఎ.సత్యవతి
కొవ్వూరు-మామిడి రత్నకుమారి
నిడదవోలు-భూపతి ఆదినారాయణ
నర్సాపూర్-బర్రిశ్రీ వెంకటరమణి
నందిగామ-మండవ వరలక్ష్మి
నూజివీడు-త్రివేణి దుర్గ
పెడన-బల్ల గంగా లింగ జోత్స్న
తిరువూరు-ఘట్టం కస్తూర్బాయి
ఉయ్యూరు-వల్లభనేని సత్యనారాయణ
చిలకలూరిపేట-షేక్ రఫానీ
మాచర్ల-తురక కిషోర్
పిడుగురాళ్ల-చిన్న సుబ్బారావు
సత్తెనపల్లి-చింతమచర్ల లక్ష్మితులసి
తెనాలి-సయ్యద్ ఖలీదా
వినుకొండ-దస్తగిరి
అద్దంకి-లక్కబోయిన ఇస్తేరమ్మ
చింకమూర్తి-చల్ల అంకులు
చీరాల-జంజరం శ్రీనివాసరావు
గిద్దలూరు-పి.వెంకటసుబ్బయ్య
కనిగిరి-అబ్దుల్ గఫార్ షేక్
మార్కాపురం-బాలమురళీకృష్ణారావు
మదనపల్లి-మనూజ
నగరి-పీజీ నీలమంగళం
పలమనేరు-ఎస్ఎం పవిత్ర
పుంగనూరు-అలీమ్ బాషా
పుత్తూరు-ఎ. హరి
ఆత్మకూరు-గోపురం వెంకటరమణమ్మ
నందిపేట-కటకం దీపిక
సూళ్లూరుపేట-డి. శ్రీమంత్ రెడ్డి
వెంకటగిరి-నక్కా భాను ప్రియ
ఆదోని-బి.శాంత
ఆళ్లగడ్డ-బి. రామలింగారెడ్డి
ఆత్మకూరు-మరూఫ్ ఆసియా
డోన్-గంటా రాజేష్
గూడూరు-జూలపాల.వెంకటేశ్వర్లు
నందికొట్కూరు-దాసి సుధాకర్ రెడ్డి
ఎమ్మిగనూరు-కె. శివన్న రఘు
బద్వేల్-వి.భూపాల్ రెడ్డి
మైదుకూరు-చంద్ర
పులివెందుల-వి.వరప్రసాద్
రాయచోటి-షేక్ ఫయాజ్ భాషా
ఎర్రగుంట్ల-హర్షవర్ధన్ రెడ్డి
గుత్తి- వన్నూర్ బీ
ధర్మవరం-లింగం. నిర్మల
గుంతకల్లు-ఎన్. భవానీ
హిందూపూర్-ఇంద్రజ
కదిరి-పి. నజీమున్నీసా
కళ్యాణదుర్గం-తలారి రాజ్ కుమార్
మడకశిర-లక్ష్మీప్రసన్న
పుట్టపర్తి-ఓబులయ్య
రాయదుర్గం-పి. శిల్ప
తాడిపత్రి-జేసీ ప్రభాకర్ రెడ్డి
విజయనగరం-విజయలక్ష్మి

కార్పోరేషన్లు మేయర్లు వీరే

విశాఖపట్టణం-జి.వెంకటహరికుమారి
విజయవాడ-రాయణి భాగ్యలక్ష్మి
గుంటూరు- మనోహర్
ఒంగోల్-సుజాత
చిత్తూరు-ఎస్.ఆముద
తిరుపతి-శిరీష
అనంతపురం-మహ్మద్ వసీన్ సలీం
కడప- సురేష్ బాబు
కర్నూల్- ఎల్ల రామయ్య

click me!