పచ్చబొట్టు ప్రాణం తీసింది.. లవ్ గుర్తు వేసుకున్నారని..

Published : Mar 18, 2021, 11:32 AM IST
పచ్చబొట్టు ప్రాణం తీసింది.. లవ్ గుర్తు వేసుకున్నారని..

సారాంశం

తల్లిదండ్రుల మీద ప్రేమ వారి ప్రాణాలు తీసింది. చెరిగిపోని ముద్ర వేసుకున్నామని మురిసిపోయేలోపే ఉసురు తీసింది. వివరాల్లోకి వెడితే చేతిమీద పచ్చబొట్టు వేయించుకుంటే తల్లి కొప్పడడంతో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పాణ్యంలో చోటుచేసుకుంది. 

చేతి పై ప్రేమ చిహ్నం తో పచ్చబొట్టు వేయించుకోవడం చూసి తల్లి మందలించడంతో అక్కచెల్లెళ్ళు పురుగు మందు తాగారు. వీరిలో చికిత్స పొందుతూ అక్క మృతి చెందగా చెల్లెలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం గోరుకల్లు గ్రామంలో వెలుగుచూసింది

స్థానికులు పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చెవిటి అరుణ, నాగ కృష్ణుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు శివరాత్రి ఉత్సవాలకు గ్రామ సమీపంలోని శ్రీ దుర్గా భోగేశ్వరస్వామి ఆలయానికి అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ బంధువులతో కలిసి వెళ్లారు.

అక్కడ చేతిపై ‘అమ్మ నాన్న’అని రాయించుకొని, ప్రేమ చిహ్నంతో పచ్చబొట్టు వేయించుకున్నారు. ఇది గమనించిన తల్లి ఇద్దరు కుమార్తెలను మందలించింది. నాన్నకు చెబుతాం అని హెచ్చరించింది. 

దీంతో భయాందోళనకు గురైన అక్క చెల్లెల్లు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

అక్కడి నుంచి వైద్యుల సూచనల మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బుధవారం కోలుకోలేక పెద్ద కుమార్తె మృతి చెందింది. చిన్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. మృతురాలి పెదనాన్న లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu