అమరావతిలో అసైన్డ్ భూముల ఇష్యూ:సీఐడీ కార్యాలయానికి ఆళ్ల

Published : Mar 18, 2021, 11:21 AM IST
అమరావతిలో అసైన్డ్  భూముల ఇష్యూ:సీఐడీ కార్యాలయానికి  ఆళ్ల

సారాంశం

ఏపీ సీఐడీ కార్యాలయానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం నాడు ఉదయం హాజరయ్యారు.   

విజయవాడ: ఏపీ సీఐడీ కార్యాలయానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం నాడు ఉదయం హాజరయ్యారు. 

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహరంలో తన వద్ద ఉన్న  ఆధారాలను అందించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ ఈ నెల 17వ తేదీన నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులు తీసుకొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ ఉదయం సీఐడీ కార్యాలయానికి చేరుకొన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలను సీఐడీ అందించనున్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ ఏడాది గత మాసంలో అసైన్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని  ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు  నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులు అందుకొన్న  చంద్రబాబునాయుడు ఈ విషయమై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

ఇదే విషయమై మాజీ మంత్రి పి. నారాయణకు కూడ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

నెల్లూరు లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు: Christmas Celebrations in Nellore | Asianet News Telugu
Vijayawada Christmas Eve Celebrations 2025: పాటలు ఎంత బాగా పడుతున్నారో చూడండి | Asianet News Telugu