ప్రబోధానందస్వామి వీడియోలను బాబుకు ఇచ్చిన జేసీ

By narsimha lodeFirst Published Sep 19, 2018, 12:58 PM IST
Highlights

ప్రబోధానందస్వామికి చెందిన వీడియో క్లిప్పింగ్‌లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  ఇచ్చారు. 

అమరావతి:ప్రబోధానందస్వామికి చెందిన వీడియో క్లిప్పింగ్‌లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  ఇచ్చారు. ప్రబోధానందస్వామి ఆశ్రమానికి చెందిన కొందరు  చిన్నపొలమడక గ్రామస్తులపై దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ ఘటనలో గాయపడిన గ్రామస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు  ఆశ్రమాన్ని ఖాళీ చేయాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు హమీ మేరకు  ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన ఆందోళన విరమించారు. మంగళవారం నాడు అమరావతికి వచ్చి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.

బుధవారం నాడు ఉదయం కూడ  ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రబోధానందస్వామికి చెందిన వీడియో క్లప్పింగ్‌లను  చంద్రబాబునాయుడుకు ఇచ్చారు. తాడిపత్రి వద్ద జరిగిన ఘటనలకు సంబంధించిన  విషయాలను చంద్రబాబుకు వివరించారు.

ప్రబోధానందస్వామికి చెందిన వీడియోలను చంద్రబాబునాయుడుకు అందించినట్టు జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని బాబు హమీ ఇచ్చారని జేసీ చెప్పారు. ఏ విషయాన్నైనా చంద్రబాబునాయుడు త్వరగా తేలుస్తారా అంటూ జేసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాడిపత్రిలో శాంతిభద్రతలు ఉన్నాయో... లేవో  హోమ్ మంత్రి చినరాజప్పను అడగాలని ఆయన మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు.

ఈ వార్తలు చదవండి

ప్రబోధానంద స్వామి వీడియోలు బయటపెడతా: జేసీ

చల్లబడిన జేసీ దివాకర్ రెడ్డి: అధికారులు ఏం చేశారంటే?

జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని హామీ

ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ

చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా

గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన

click me!