కళ్ళు తిరిగి పడిపోయిన జెసి

Published : Feb 04, 2018, 01:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
కళ్ళు తిరిగి పడిపోయిన జెసి

సారాంశం

చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆదివారం ఉదయం మొదలైన కీలక సమావేశానికి హాజరవ్వటానికి జెసి ఉండవల్లికి వచ్చారు.

అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి క్రింద పడిపోయారు. చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆదివారం ఉదయం మొదలైన కీలక సమావేశానికి హాజరవ్వటానికి జెసి ఉండవల్లికి వచ్చారు. ఆ సమయలో సహచరులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. జెసి క్రిందపడిపోవటాన్ని గమనించిన మిగిలిన వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు. వెంటనే వైద్యులను పిలిపించారు. హుటాహుటిన వచ్చిన వైద్యులు జెసిని పరీక్షించారు.  జెసి బిపి, షుగర్ లెవల్స్ లో కాస్త మార్పులు ఉన్నట్లు చెప్పారు. అందుకు అవసరమైన చికిత్స చేశారు. తర్వాత కాసేటప్పటికి జెసి కోలుకున్నారు. తనకు బాగానే ఉందని ఆందోళన అవసరం లేదని జెసి చెప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan : డిప్యూటీ సీఎం లగ్జరీ కార్ కలెక్షన్ .. ఎన్ని కార్లున్నాయి..? వీటి విలువ ఎంత?
IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!