మున్సిపల్ ఎన్నికలు: కొనసాగింపులొద్దు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి.. ఎస్ఈసీకి పవన్ విజ్ఞప్తి

By Siva KodatiFirst Published Feb 16, 2021, 5:53 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ జరపడంపై ఎస్ఈసీ పునరాలోచించాలని ఆయన కోరారు. అధికార పక్షం దౌర్జనాల వల్ల ఎంతోమంది పోటీకి దూరమయ్యారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. 

కాగా ఇప్పటికే గతంలో ఆగిపోయిన చోట నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషనుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డను తెలుగుదేశం కోరింది.

Also Read:బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ.. నిమ్మగడ్డ సీరియస్, కీలక ఆదేశాలు

ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను కొత్తగా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఏడాది పాటు నిలిపివేయడంతో చాలా మంది ఆసక్తి కోల్పోయారన్న ఆయన.. మరికొందరు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహంగా వున్నారని మారెడ్డి చెప్పారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వాలని.. నామినేషన్లకు మరో మూడు రోజులు అదనంగా సమయం కేటాయించాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. 

click me!