తీవ్రతరమవుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం: రేపు విశాఖకు సీఎం జగన్

By Siva KodatiFirst Published Feb 16, 2021, 5:24 PM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి ఆయన విశాఖ వెళ్తారు. నగరంలోని శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొంటారు సీఎం. దీనితో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీని కలవనున్నారు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి ఆయన విశాఖ వెళ్తారు. నగరంలోని శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొంటారు సీఎం.

దీనితో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీని కలవనున్నారు జగన్. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల భాటలో నడిపించాలి అంటే ఏం చేయాలి..? ఉద్యోగులు ఏమనుకుంటున్నారు?  కేంద్రం ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలి తదితర అంశాలపై సీఎం జగన్ ఆరా తీస్తారు.

Also Read:మీరు రాజీనామాలు చేస్తే మేం రెడీ: విశాఖలో వైసీపీకి బాబు సవాల్

శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనాలన్నది ముందునుంచి ఉన్న షెడ్యూల్ అయినా.. అనుకోకుండా ఆయన స్టీల్ ఉద్యోగుల జేఏసీని కలవడం వెనుక వేరే ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మంగళవారం ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించి, స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాతి రోజే జగన్ విశాఖ పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

click me!