సీఎం జగన్ తో జనసేన ఎమ్మెల్యే భేటీ

By telugu teamFirst Published Jun 12, 2019, 1:12 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జనసేన ఎమ్మెల్యే వర ప్రసాద్ భేటీ అయ్యారు. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జనసేన ఎమ్మెల్యే వర ప్రసాద్ భేటీ అయ్యారు. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా... తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే వర ప్రసాద్  శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం ఛాంబర్ కి వెళ్లారు.

అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. భేటీ అనంతరం బయటకు వచ్చిన వర ప్రసాద్  మీడియాతో మాట్లాడారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని... కేవలం మర్యాద పూర్వకంగా మాత్రమే సీఎం జగన్ ని కలిసినట్లు చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన పార్టీ తరపున వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన అధికార పార్టీ వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగాలు వచ్చాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని ఇటీవల వరప్రసాద్ స్పష్టం చేశారు.

click me!