జగన్ తో చర్చలు: ఎపిఎస్ ఆర్టీసిలో సమ్మెపై వెనక్కి

By telugu teamFirst Published Jun 12, 2019, 12:53 PM IST
Highlights

శాసనసభలోని ఛేంబర్ లో జెఎసి నేతలు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంతకు ముందు జెఎసి నేతలు ఆర్టీసి ఎండీతోనూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితోనూ చర్చలు జరిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని గతంలో ఆర్టీసీ ఉద్యోగుల జెఎసి నేతలు ప్రకటించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టిసీ)లో సమ్మెపై ఉద్యోగులు వెనక్కి తగ్గారు. ఆర్టీసి ఉద్యోగుల జెఎసి నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపారు. జగన్ తో భేటీ తర్వాత సమ్మె ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు జెఎసి నేతలు తెలిపారు. 

శాసనసభలోని ఛేంబర్ లో జెఎసి నేతలు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంతకు ముందు జెఎసి నేతలు ఆర్టీసి ఎండీతోనూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితోనూ చర్చలు జరిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని గతంలో ఆర్టీసీ ఉద్యోగుల జెఎసి నేతలు ప్రకటించారు. ఆర్టీసి సంఘాలు పెట్టిన 27 డిమాండ్లకు కూడా జగన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. చర్చలు సానుకూల ఫలితం ఇవ్వడంతో సమ్మె ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబందించిన విషయాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 

click me!