వైసీపీ ఎమ్మెల్యేతో బాలయ్య... అసెంబ్లీలో సందడి

Published : Jun 12, 2019, 12:50 PM ISTUpdated : Jun 12, 2019, 01:00 PM IST
వైసీపీ ఎమ్మెల్యేతో బాలయ్య... అసెంబ్లీలో సందడి

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం మొదలయ్యాయి. తొలుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రతిపక్ష పార్టీ నేతగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం మొదలయ్యాయి. తొలుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రతిపక్ష పార్టీ నేతగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా...మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ప్రమాణస్వీకారం చేశారు. అలా చేసిన వారిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఉన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు అసెంబ్లీ ఆవరణలో బాలకృష్ణ కాసేపు సందడి చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు... వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా బాలయ్య కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మీడియా ద్వారా బయటకు రాగా... నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

ఇదిలా ఉంటే... నూతనంగా మంత్రి బాధ్యతలు చేపట్టిన, వైసీపీ నేత కొడాలి నానితో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆప్యాయంగా మాట్లాడారు. కొడాలి నాని చెయ్యి పట్టుకొని మరీ పయ్యావుల మాట్లాడుతుండగా... కెమేరామెన్లు ఫోటోలను క్లిక్ మనిపించారు. గతంలో వీరిద్దరూ ఒకే పార్టీ కోసం పనిచేసిన వారే. తర్వాత పరిస్థితులు మారడంతో.. కొడాలి నాని వైసీపీలో చేరారు. ఇప్పుడు మంత్రి పదవి చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : మీరు ఈ వీకెండ్ కూరగాయల మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ధరలెలా ఉన్నాయో తెలుసుకొండి
CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu