జగన్ వ్యాఖ్యలు ఆయన అసహనాన్ని చెబుతున్నాయి.. జనసేన ఎందుకు రౌడీ సేన? అంటూ నాదెండ్ల ప్రశ్నల వర్షం

Published : Nov 21, 2022, 03:30 PM ISTUpdated : Nov 21, 2022, 03:36 PM IST
జగన్ వ్యాఖ్యలు ఆయన అసహనాన్ని చెబుతున్నాయి.. జనసేన ఎందుకు రౌడీ సేన? అంటూ నాదెండ్ల ప్రశ్నల వర్షం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తపుత్రుడి పార్టీ రౌడీసేనగా మారిందని సీఎం జగన్ ‌ చేసిన వ్యాఖ్యలకు నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తపుత్రుడి పార్టీ రౌడీసేనగా మారిందని సీఎం జగన్ ‌ చేసిన వ్యాఖ్యలకు నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయని విమర్శించారు. ‘‘జనసేన ఎందుకు రౌడీ సేన?.. జగన్ గారూ’’ అంటూ ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

‘‘జనసేన ఎందుకు రౌడీ సేన?.. మీరు రోడ్డునపడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా?’’ అని నాదెండ్ల మనోహన్ ఫైర్ అయ్యారు. 

Also Read: టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు.. చంద్రబాబులో ఆ భయం కనిపిస్తోంది: సీఎం జగన్ ఫైర్

నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను, వీర మహిళలను, జన సైనికులను, జనసేన పార్టీని 
 ని కించపరుస్తూ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయని విమర్శించారు. 

ఇదిలా ఉంటే.. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన సీఎం జగన్.. పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని విమర్శించారు. దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని మండిపడ్డారు. వీరు గతంలో చేసిన పాలనను ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు, దత్తపుత్రుడికి ప్రజలు బై బై చెప్పారని అన్నారు. గత పాలకుల ఊహకు కూడా అందని విధంగా తమ ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని జగన్ చెప్పారు. చెప్పుకోదగ్గ పని ఏది చేయలేదని తెలుసు కనుకే చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు నోటికి పని చెబుతున్నారని విమర్శించారు. తాము చేస్తున్న అభివృద్దిని చూసి అన్ని సామాజిక వర్గాల వారు, ప్రాంతాల వారు.. జరిగిన ప్రతి ఉప ఎన్నికలో, ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేశారని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్