మత్స్యకారుల ఉపాధి గండికొట్టేలా తీసకువచ్చిన 217 జీవోను వెనక్కి తీసుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
అమరావతి: మత్స్యకారుల ఉపాధికి గండికొట్టేలా తీసుకు వచ్చిన 217 జీవోను వెనక్కి తీసుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 217 జీవోతో మత్స్యకారుల ఉపాధికి గండిపడే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. గంగపుత్రుల అభ్యున్నతికి జనసేన కట్టుడి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు.మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పని చేయడం లేదని ఆయన విమర్శించారు.
మత్స్యకారుల జీవన స్థితిగతులను మెరుగుపర్చే విషయాన్ని విస్మరించిన పాలకులను కచ్చితంగా ప్రజా క్షేత్రంలో నిలదీయాలని జనసేనాని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను చేసిన పోరాట యాత్ర సమయంలో, జనసేన ఈ ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన ‘మత్స్యకార అభ్యున్నతి యాత్ర’లోనూ మత్స్యకారుల బాధలు వెల్లడయ్యాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
undefined
సముద్రంలో వేటకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన మత్య్సకారులకు రూ.10 లక్షలు ఇస్తామనే హామీ నేటికీ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. నిబంధనల పేరుతో మత్స్యకార కుటుంబాలను ఇబ్బందిపెడుతున్నారని చెప్పారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుదలకు నిపుణులతో తమ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మత్స్యకార గ్రామాల్లో ఇప్పటికీ మౌళిక వసతులు లేవన్నారు. ఉపాధి కోసం మత్స్యకారులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లడాన్ని అభివృద్ది అనుకోవాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. . 217 జీవో జారీ చేయడం పురోగమనం అనుకోవాలని అని పవన్ కళ్యాణ్ అడిగారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించిన సమయంలో మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మత్స్య కారుల సంక్షేమం కోసం తమ పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు.
జనసేనకు 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 217 జీవోను జారీ చేసి ఉండేదని కాదని పవన్ కళ్యాణ్ గతంలోనే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ జీవోపై టీడీపీ సహా ఇతర విపక్షాలు చేస్తున్న ప్రచారంపై వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. 217 జీవోపై జనసేన పార్టీ ఆందోళనలు నిర్వహిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో మత్య్సకార సభను కూడా నిర్వహించారు. 217 జీవోపై భయపడాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. వంద హెక్టార్ల విస్తీర్ణం గల చెరువులను బహిరంగ వేలం ద్వారానే వేలం వేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఈ 217 జీవోను నిరసిస్తూ మత్య్సకార జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి మాసంలో మత్య్సకార జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు నిర్వహించారు.