2024 తర్వాత చంద్రబాబును టీడీపీ నుంచి తరమడానికి ఎన్టీఆర్ వారసులు సిద్దంగా ఉన్నారు: కొడాలి నాని

Published : Nov 21, 2022, 02:45 PM IST
2024 తర్వాత చంద్రబాబును టీడీపీ నుంచి తరమడానికి ఎన్టీఆర్ వారసులు సిద్దంగా ఉన్నారు: కొడాలి నాని

సారాంశం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ వచ్చి పోటీ చేసినా వైసీపీ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ వచ్చి పోటీ చేసినా వైసీపీ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానని చెప్పారు. కుల సంఘాలు వచ్చినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిన గుడివాడలో గెలుపు తనదేనని అన్నారు. టీడీపీ పోటీలను ప్రజలు మరిచిపోలేదని అన్నారు. సీఎం జగన్‌ను బూతులు తిట్టేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడు సీఎం కాకపోతే ప్రజలకు పోయేది ఏమి లేదని అన్నారు. చంద్రబాబుకే కాదు.. టీడీపీకి కూడా ఇదే చివరి ఎన్నికలు అని విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్‌లను టీడీపీ నుంచి తరమడానికి ఎన్టీఆర్ వారసులు సిద్దంగా ఉన్నారని కామెంట్స్ చేశారు. తర్వాత ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబు, లోకేష్‌లు అనుకుంటారని ఎద్దేవా చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్