
Janasena Digital Movement; విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రతిపక్షనేతలకు ఈ ఆంశం అస్త్రంగా దొరికింది. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని.. అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలో వైసీపీ ఏంపీలను టార్గెట్ చేశాడు. వారు పార్లమెంట్‌లో కేంద్రంపై పోరాడేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంతో డిజిటల్ ఉద్యమానికి పిలుపునిచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన డిజిటల్ ఉద్యమాన్ని(Janasena Digital Movement) చేపట్టనుంది. 18, 19, 20 తేదీల్లో ప్రజలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి.. వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎంపీలకు బాధ్యత గుర్తు చేద్దామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: AP: మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే ఎందయ్య మీ లొల్లి.. పోలీసులపై చింతమనేని ఫైర్
151మంది ఎమ్మెల్యేలు, 22మంది ఎంపీలు ఉన్న వైకాపా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ... తమ గొంతు వినిపించడం లేదని మండిపడ్డారు. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానిదే బాధ్యత.. మనమేం చేయనక్కర్లేదనే ధోరణితో జగన్ సర్కార్ ఉందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీకి తన బాధ్యతను గుర్తు చేసేలా డిజిటల్ క్యాంపెయిన్ ఉంటుందని జనసేనాని చెప్పారు. విశాఖ స్టీల్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రతి ఒక్కరు కలిసిన ముందు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయ పార్టీలు విబేధాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరారు.
Read Also: Janasena Vs TDP: వంగవీటి రంగా విగ్రహం వద్ద లోకేష్ కు చేదు అనుభవం (Video)
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 12న పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఆందోళన 300 రోజులకు పైగా సాగుతోందని.. వారికి నైతికంగా మద్దతిచ్చేందుకు పవన్ దీక్ష చేపట్టినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
Read Also: సోషల్ మీడియాలో పరిచయం.. ఆ యువకుడిని నమ్మి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. కానీ..
ఇక తాను చేసిన దీక్షకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. గాజువాకలో ఓడినా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్నామని, తాను పార్టీ పెట్టింది పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా.. విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ పై సీఎం జగన్ స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు.