
పీఆర్సీ సహా ఇతర డిమాండ్లకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు జరిపారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . సీఎం జగన్‌తో (ys jagan) జరిపిన చర్చల సారాంశాన్ని ఉద్యోగ సంఘాలకు వివరించారు. ఉద్యమానికి తాత్కాలికంగానే విరామం ప్రకటించామని... సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చినందుకే విరామం ప్రకటించామన్నారు. మరికొన్ని రోజులుగా పీఆర్సీపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా అమరావతి జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు (bandi srinivasa rao) మాట్లాడుతూ.. పీఆర్సీ, ఫిట్ మెంట్ పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సోమవారం నాటికి ఫిట్‌మెంట్ పై క్లారిటీ రావచ్చని... 2018 జులై 1 నుంచి ఫిట్‌మెంట్ అమలు చేయాలని కోరామని శ్రీనివాసరావు వెల్లడించారు. ఆశీతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ యథాతధంగా అమలు చేయాలని.. 50 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
ALso Read:AP PRC : ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె తాత్కాలిక విరమణ: ఉద్యోగ సంఘాలు
ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) మాట్లాడుతూ.. ఉద్యమాన్ని విరమించలేదని, తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పీఆర్సీ ప్రకటనకు మా ఉద్యమం ఆటంకం కాకూడదని.. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఉద్యోగుల్లో అభద్రతాభావం కలుగుతుందని బొప్పరాజు పేర్కొన్నారు. వచ్చే మంగళవారం లోపే ఫిట్‌మెంట్‌పై క్లారిటీ ఇస్తామని చెప్పారని.. ఇక నుంచి ఏ సమస్య ఉన్నా, తక్షణమే పరిష్కరించేలా ఒక ప్రత్యేక అధికారి నియమిస్తామని చెప్పారని వెంకటేశ్వర్లు తెలిపారు.