ఓట్లు చీలకూడదు .. వ్యతిరేకత వున్నవాళ్లే గెలుస్తారు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 25, 2023, 07:32 PM IST
ఓట్లు చీలకూడదు .. వ్యతిరేకత వున్నవాళ్లే గెలుస్తారు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఓటు చీలడం వల్ల ప్రజా వ్యతిరేకత వున్న వాళ్లు గెలుస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . ప్రజాస్వామ్యంలో ఎక్కువ మందిని ఒప్పించినవారు రాజకీయాల్లోకి రావాలి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

ఓటు చీలడం వల్ల ప్రజా వ్యతిరేకత వున్న వాళ్లు గెలుస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారాహియాత్రలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ... 70 శాతం ప్రజలు వ్యతిరేకించిన వాళ్లు పదవిలోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. 100 మంది దగ్గర పన్నులు తీసుకుని 40 మంది వైసీపీ వాళ్లకే లబ్ధి చేస్తే ఎలా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలులో 15 రోజుల్లో రోడ్లు వేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 15 రోజుల్లో రోడ్డు వేయకుంటే తానే వచ్చి శ్రమదానంతో రోడ్డు వేస్తానని ఆయన హెచ్చరించారు. ప్రజలకు సరైన రోడ్లు వేయకుంటే ఎన్ని బటన్లను నొక్కితే ఏం లాభమని పవన్ కల్యాణ్ నిలదీశారు. 

వైసీపీ మోసాలు చదివి చదివి నాకు కళ్లు కూడా కనిపించడం లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019లో ఓటమితో తాను గుండెకోతను అనుభవించానని తెలిపారు . చిత్తుగా ఓడిపోయినప్పుడు సర్వస్వం కోల్పోయానని అనిపించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. కానీ రాజోలులో మీరిచ్చిన గెలుపు ఓదార్పునిచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ మందిని ఒప్పించినవారు రాజకీయాల్లోకి రావాలి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

ALso Read: గోదావరి జిల్లాలో వైసీపీని జీరో చేయాలి.. పులివెందులకు వచ్చి జగన్‌కు సంస్కారం నేర్పిస్తాం: పవన్

పార్టీని నడపటం చాలా కష్టసాధ్యమైన పని అన్నారు. వేల కోట్లు వున్నవాళ్లు కూడా పార్టీని నడపాలంటే భయపడతారని, ధైర్యవంతులైన 150 మందితో జనసేన పార్టీ ప్రారంభమైందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాలేదు, అన్ని కులాలను కలిపేందుకు వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.  ప్రజాస్వామ్యంలో ఎక్కువ మందిని ఒప్పించినవారు రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గుర్రం జాషువా విశ్వనరుడు అనే సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చానని.. తొలుత తాను భారతీయుడినని, చివరగా తాను భారతీయుడిని అని చెప్పిన అంబేద్కర్ తనకు స్పూర్తి అన్నారు. జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు చేయటం నా బాధ్యత అని పవన్ స్పష్టం చేశారు. 

జనసేన తరపున ప్రతి నియోజకవర్గంలో పోటీకి నలుగురు ముందుకు వస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మా ఓటుతో గెలిచి వేరొక పార్టీలోకి పోతే ప్రజలు సహించరని మండిపడ్డారు. తన ఎదురుగా వున్నవాళ్లంతా ప్రేమతో వచ్చినవాళ్లే.. డబ్బు కోసం వచ్చినవాళ్లు కాదన్నారు. గోదావరిలా తాను ఈ నేలను అంటి పెట్టుకుని వుంటానిన పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బటన్ నొక్కితే రూ.10 వేలు పడుతున్నాయని.. కానీ అందరికి సమానంగా పంచడం లేదన్నారు. అనేక వస్తువుల మీద జీఎస్టీ చెల్లించి మనమే ప్రభుత్వ ఖజానా నింపుతున్నామని, ఆ డబ్బును అందరికీ సమానంగా పంచాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?