రేపు విశాఖలో ప్రధాని మోడీతో భేటీ కానున్న పవన్ .. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Siva Kodati |  
Published : Nov 10, 2022, 07:40 PM ISTUpdated : Nov 10, 2022, 07:49 PM IST
రేపు విశాఖలో ప్రధాని మోడీతో భేటీ కానున్న పవన్ .. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

సారాంశం

రేపు విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, శాంతి భద్రతలపై ఆయన ప్రధానితో చర్చించనున్నారు. 

రేపు విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, శాంతి భద్రతలపై ఆయన ప్రధానితో చర్చించనున్నారు. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని జనసేన, ఏపీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మోడీ బస చేసే ఐఎన్ఎస్ చోళ లో 10 నిమిషాల పాటు మోడీతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. రేపు రాత్రి బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ తర్వాత కానీ, లేదంటే 12వ తేదీ ఉదయం కానీ కలిసేందుకు అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు - పవన్ కళ్యాణ్ ల సమావేశం తర్వాత మోడీ - పవన్ ల భేటీ పై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత నెలకొంది. 

ఇక, ప్రధాని మోదీ రేపుసాయంత్రం విశాఖపట్నం చేరుకుంటారు మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖకు చేరుకుంటారు. తూర్పు నౌకాదళ కమాండ్‌కు వెళ్లనున్న మోదీ.. రాత్రికి చోళ షూట్ లో బస చేస్తారు. 12 తేదీ ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీకి చేరుకుంటారు. ఆయన 12వ తేదీ మధ్యాహ్నం వరకు విశాఖలోనే ఉండనున్నారు. అయితే ప్రధాని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్‌ను పీఎంఓ ఇంకా వివరంగా పంపలేదని అధికారులు చెబుతున్నారు. 

Also Read:12న ఆర్‌ఎఫ్‌సిఎల్ ప్రారంభోత్సవానికి మోడీ.. ఈసారి కూడా ప్రధాని సభకు కెసిఆర్ గైర్హాజరు..!

ఈ క్రమంలోనే విశాఖలో భద్రతను కట్టుదిట్టం  చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పోలీసులును విశాఖకు రప్పిస్తున్నారు. ప్రధాని మోదీ  పర్యటన దృష్ట్యా విశాఖలో.. రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుంచి, కేంద్ర ప్రభుత్వ బలగాల నుంచి మొత్తం 5,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. విశాఖకు వచ్చే అన్ని కీలకమైన పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన భద్రతా  బలగాలు.. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

మరోవైపు...  నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో అధికారులు పలు ఆంక్షలు విధించారు. డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించిన పోలీసులు.. పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 5 కి.మీ పరిధిలో డ్రోన్లు ఎగరవేయొద్దరి ఆంక్షలు విధించినట్టుగా విశాఖపట్నం పోలీసు కమిషనర్ తెలిపారు. నేటి నుంచి ఈ నెల 13 వరకు డ్రోన్ల వినియోగంపై నిషేధం అమలులో ఉంటుందని  చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?