వేమన స్థానంలో వైఎస్ విగ్రహం ... స్పందించిన పవన్, పద్యంతోనే చురకలు

Siva Kodati |  
Published : Nov 10, 2022, 04:06 PM IST
వేమన స్థానంలో వైఎస్ విగ్రహం ... స్పందించిన పవన్, పద్యంతోనే చురకలు

సారాంశం

కడప జిల్లాలో వున్న యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 

కడప జిల్లాలో వున్న యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఎప్పటి నుంచో వున్న వేమన విగ్రహం స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విమర్శలకు దారి తీసింది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వేమన రాసిన ఓ పద్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనితో పాటు వేమన విగ్రహం తొలగింపునకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పంచుకున్నారు. 

విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.

కాగా..యోగి వేమన విశ్వవిద్యాలయాలన్ని 2006లో వైఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నెలకొల్పారు. అదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు వేమన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా అధికారులు యోగి వేమన విగ్రహాన్ని తొలగించి దాని స్థానంలో వైఎస్ విగ్రహాన్ని నెలకొల్పారు. దీనిపై విద్యార్ధి సంఘాలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ విగ్రహాన్ని కావాలనుకుంటే వర్సిటీలోనే మరో చోట పెట్టుకోవచ్చవని.. వేమన విగ్రహాన్ని తొలగించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 
....................

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee
ఎవర్ గ్రీన్ హీరో బాలయ్య చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన బాలయ్య | CM Chandrababu Speech | Balayya