హైకోర్టు (ap high court) నుంచి తప్పించుకోడానికే మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం (ap govt) వెనక్కి తగ్గిందన్నారు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) . మరింత స్పష్టతతో కొత్త బిల్లులు తీసుకొస్తామని చెప్పి ఏపీ ప్రజల్ని వైసీపీ (ysrcp) ప్రభుత్వం మరింత గందరగోళంలోకి నెట్టిందని ఆయన ఆక్షేపించారు
హైకోర్టు (ap high court) నుంచి తప్పించుకోడానికే మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం (ap govt) వెనక్కి తగ్గిందన్నారు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) . మరింత స్పష్టతతో కొత్త బిల్లులు తీసుకొస్తామని చెప్పి ఏపీ ప్రజల్ని వైసీపీ (ysrcp) ప్రభుత్వం మరింత గందరగోళంలోకి నెట్టిందని ఆయన ఆక్షేపించారు. రాజధాని అమరావతికి (amaravathi) సంబంధించి 54 కేసులపై హైకోర్టులో చురుగ్గా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించి తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకొనేందుకే బిల్లుల రద్దుకు జగన్ సర్కార్ సిద్ధపడిందని పవన్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో కొత్త నాటకానికి తెరతీసిందని ఆయన వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర ఏర్పడి ఏడున్నరేళ్లు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి పాలకులు తీసుకొచ్చారని పవన్ మండిపడ్డారు.
వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ చిలకపలుకులు పలుకుతున్న పాలకులు.. ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానులు (ap three capitals) లేవన్న విషయాన్ని విస్మరిస్తున్నారని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతేనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్న భ్రమల్లో వైసీపీ పెద్దలు మునిగితేలుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. అమరావతిపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒకే రాజధాని చాలని ఒకే మాటపై నిలవగా వైసీపీ మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోందని ఆయన మండిప్డారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన అమరావతి రైతులకు జనసేన బాసటగా నిలుస్తుందని పవన్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధానిగా మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని తాము కోరుకుంటున్నట్లు జనసేన అధినేత స్పష్టం చేశారు.
ALso Read:అసెంబ్లీ ముందుకు మళ్లీ రాజధానుల బిల్లు.. ఈ సారి మరింత సమగ్రంగా: జగన్
కాగా.. మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకోవడంపై అసెంబ్లీలో (ap assembly) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. విస్తృత, విశాల ప్రయోజనాలు కాపాడేందుకే బిల్లును వెనక్కి తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదించిన వెంటనే ప్రక్రియ ప్రారంభమై వుంటే మంచి ఫలితాలు వచ్చి వుండేవని జగన్ అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ బిల్లు పెట్టామని సీఎం స్పష్టం చేశారు. 3 రాజధానులపై మరింత మెరుగైన బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని చట్టాల ఉపసంహరణ తాత్కాలికమేనని ఆయన చెప్పారు.
అమరావతిలో రాజధాని, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు లక్షల కోట్లు ఖర్చవుతుందని సీఎం అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుందని జగన్ ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా అని ఆయన నిలదీశారు. ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ అని.. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయని జగన్ చెప్పారు. వాటికి అదనపు హంగులు దిద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది అని సీఎం జగన్ ఆకాంక్షించారు.