three capitals bill: జగన్ తీరుతో రాష్ట్ర ఆదాయానికి గండి... ఇకపై ప్రజాక్షేత్రంలోనే: చంద్రబాబు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 22, 2021, 8:04 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును (ap three capitals bill) వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును (ap three capitals bill) వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) స్పందించారు. రాజధానిపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి (ys jagan mohan reddy) వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు రాష్ట్ర ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ (kondapalli muncipality) ఎన్నిక విషయంలో అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. 

Also Read:Three Capitals Bill: మూడు రాజధానులపై జగన్ ఎందుకు వెనక్కి తగ్గారు?.. మరో బిల్లు ఇప్పట్లో లేనట్టేనా?

రాష్ట్రంలో వరదల వల్ల (ap floods) ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని చంద్రబాబు ఆవేదన  వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 34 మంది చనిపోగా, 10 మంది గల్లంతయ్యారని ఆయన తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయ కార్యక్రమాలను అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు దుయ్యబట్టారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అజాగ్రత్త, ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలో బృందాలు బాధితులకు అన్ని విధాల అండగా నిలవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 23, 24 తేదీల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు.  

జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాలు, వాటిల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరణ పేరుతో ఒక్కో పేద కుటుంబం నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ విధంగా ఆదాయం పొందాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. పేద కుటుంబాలు ఎవరూ ఈ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా పేదలకు పంపిణీ చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 

click me!