మేకులున్న లాఠీలతో కొట్టారు.. పోలీసుల ముసుగులో వాళ్లపనే: పవన్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 21, 2020, 02:48 PM IST
మేకులున్న లాఠీలతో కొట్టారు.. పోలీసుల ముసుగులో వాళ్లపనే: పవన్ వ్యాఖ్యలు

సారాంశం

కాకినాడలో జనసేన కార్యకర్తల్ని మేకులు ఉన్న లాఠీలతో కొట్టారని.. అలాంటివాటిని పోలీసులు వాడరని, పోలీసుల ముసుగులో అల్లరి మూకల పనే అన్నారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రైతులను అడ్డుకున్న పోలీసులవైపు నుంచి రాళ్లు పడ్డాయని పవన్ ఆరోపించారు

కాకినాడలో జనసేన కార్యకర్తల్ని మేకులు ఉన్న లాఠీలతో కొట్టారని.. అలాంటివాటిని పోలీసులు వాడరని, పోలీసుల ముసుగులో అల్లరి మూకల పనే అన్నారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రైతులను అడ్డుకున్న పోలీసులవైపు నుంచి రాళ్లు పడ్డాయని పవన్ ఆరోపించారు.

పోలీస్ శాఖను శాంతి భద్రతలకు వాడమంటే వైసీపీ ప్రభుత్వం రౌడీయిజం చేయిస్తోందని పవన్ మండిపడ్డారు. పులివెందుల రౌడీయిజాన్ని పోలీస్ శాఖకు అందించే స్థాయికి తీసుకెళ్లారన్నారు.

లాఠీఛార్జీలో గాయపడిన రైతులను పరామర్శించేందుకు వెళ్తానంటే తనను అడ్డుకోవడానికి డీఐజీ స్థాయి అధికారిని పంపించారని పవన్ ధ్వజమెత్తారు. కన్నీళ్లు పెట్టుకున్న ప్రజలకు న్యాయం జరగాలంటే జనసేన ఆఫీస్ గుర్తుకు రావాలన్నారు.

Also Read:జగన్ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోను, పతనం ప్రారంభం : పవన్ కళ్యాణ్

మహిళల ఒంటిపై పడిన దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తుందని, మాటలు రాని.. బాధలు చెప్పుకోలేని కిరణ్ నాయక్ అనే దివ్యాంగుడిని పోలీసులు చావబాదారని పవన్ మండిపడ్డారు. అతని బాధను దేవుడు తప్పకుండా వింటాడన్నారు. మీ భూములను అడ్డగోలుగా దోచేసి, పనికిరాకుండా చేసి రైతులను కన్నీళ్ల పాలు చేశారని తెలిపారు. 


రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని కూల్చేవరకు జనసేన పార్టీ నిద్రపోదని అన్నారు. వైసీపీ నేతలందరికీ జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ అనే నేను వార్నింగ్ ఇస్తున్నాను అని అన్నారు. 

వైసీపీ నాయకులకు ఒళ్ళంతా మదమెక్కి మాట్లాడుతున్నారని, అరికాలి నుండి నడినెత్తివరకు మదం ఎక్కి కొట్టుకుంటున్నారని అంటూ కన్నీరు వస్తున్నా దాన్ని దిగమింగుకొని మాట్లాడారు పవన్ కళ్యాణ్. 

తన కోపాన్ని ఆవేదన దాటుకొని బయటకొస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆడపడుచులపై అధికారపార్టీ దాష్టీకం వారి పతనానికి నాంది అని ఆయన అన్నారు. ఆడపడుచులు, ముసలి, ముతక అనే తేడా లేకుండా అందరి మీద ఇలా పోలీసులు దౌర్జన్యం చేయడం భావ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

Also Read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

తాను ఏనాడూ కూడా అధికారం కోసం పాకులాడలేదని, తాను ధర్మాన్ని అనుసరించి మాత్రమే మాట్లాడుతానని, అమరావతికి తన మద్దతు తెలిపితే మిగిలిన చజొట తన పార్టీ ఏమయిపోతుందో అన్న భయం తనకు లేదని, అమరావతినే శాశ్వత రాజధానిగా ఉంచడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. 

బీజేపీతో కలిసేటప్పుడే అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి అనుకూలమా అని ప్రశ్నించానని, బీజేపీతో కలిసేటప్పుడే అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి అనుకూలమా అని ప్రశ్నించానని, అందుకు వారు కూడా తమ వైఖరి కూడా అదే అని ప్రకటించారని, అందుకోసమే తాము వారితో కలిశామని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?