నేను నోరు తెరిస్తే మీరు ఊపిరి కూడ తీసుకోలేరు: జగన్‌కు పవన్ హెచ్చరిక

First Published Jul 27, 2018, 6:14 PM IST
Highlights

తాను నోరు తెరిచి వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ కూడ ఊపిరితీసుకోలేరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.  మీ వ్యక్తిగత జీవితాల గురించి  కూడ తాను కూడ మాట్లాడగలనన్నారు.


భీమవరం: తాను నోరు తెరిచి వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ కూడ ఊపిరితీసుకోలేరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.  మీ వ్యక్తిగత జీవితాల గురించి  కూడ తాను కూడ మాట్లాడగలనన్నారు. ఒకవేళ తాను కూడ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే తట్టుకోలేరని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం నాడు జరిగిన సభలో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  మాట్లాడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన జీవితంలో ఎలాంటి దాపరికాలు లేవన్నారు. ఎవరూ కూడ ఆకాశం నుండి ఊడిపడలేదన్నారు. యూనివర్శిటీలో ఎవరేం చేశారో తనకు తెలుసునని చెప్పారు.

తాను ప్రజా సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్ చేస్తే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  తన మీద వ్యక్తిగత  ఆరోపణలకు దిగుతున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పారు.  చంద్రబాబునాయుడును ఎదుర్కొనే దమ్ము, ధైర్యం  లేకపోవడంతోనే వైఎస్ జగన్ అసెంబ్లీ నుండి పారిపోయారని  జగన్‌పై  పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.  ప్రజల సమస్యలు పరిష్కారమౌతాయంటే తనపై వ్యక్తిగత విమర్శలు చేయాలని ఆయన తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.

చాలా మంది జీవితాల్లో మాదిరిగా తన జీవితంలో ఎలాంటి దాపరికాలు లేవన్నారు. తాను ఏం చేసినా  అందరికీ తెలిసి చేస్తానని చెప్పారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే గొప్ప నేతలు కాలేరని  పవన్ కళ్యాణ్ చెప్పారు.తాను ప్రజాసమస్యల  గురించి మాట్లాడితే జగన్ తనపై వ్యక్తిగత విమర్శలకు దిగారన్నారు.  జగన్ స్థానంలో తాను ఉంటే ప్రభుత్వాన్ని ఆడుకొనే వాడినని చెప్పారు.

ఫ్యాక్షనిజానికి గుండాయిజానికి  తాను భయపడనని  పవన్ కళ్యాణ్ చెప్పారు. తన వెంట రౌడీలు, గూండాలు లేరన్నారు.  తన వెంట జనసైన్యం మాత్రమే ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లను, 2 ఎంపీల సీట్లలో టీడీపీని గెలిపిస్తే  పశ్చిమగోదావరి జిల్లాకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కనీసం డంపింగ్ యార్డును ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాకు ఏం చేశారో  చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  చంద్రబాబునాయుడు, లోకేష్, వైఎస్ జగన్ ఒకవైపు, తాను ఒకవైపు  పశ్చిమగోదావరి జిల్లాకు ఏం చేశారో చర్చించేందుకు రావాలని పవన్  కోరారు. టీడీపీ నేతలు మట్టి మాఫియాకు కూడ పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అవినీతి యనమలకుదురు డ్రైన్ మాదిరిగా కంపు కొడుతోందన్నారు.

గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఓటమి పాలు అవుతామనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబునాయుడు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే జనసేన పోటీ చేస్తోందని ఆయన ప్రకటించారు. ఓటమి పాలు అవుతామనే ఉద్దేశ్యంతో అసెంబ్లీ ఎన్నికలను కూడ వాయిదా వేస్తారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో అనుభవం లేక పోటీ చేయలేదన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని సీట్లలో  తాము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 

ఈ వార్తలు కూడ చదవండి 

మాకు ఆ దమ్ముంది: పవన్‌పై జగన్ వ్యాఖ్యల మీద నాగబాబు

జగన్‌తో ఫోటోపై దుమారం: పవన్‌ కు ఫ్యాన్‌ని, మీ ఇంట్లో వాళ్లకే జరిగితే.

 


 

click me!