రాజధాని తరలింపు, మూడు రాజధానులు: కేంద్రంపై పవన్ కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 10, 2020, 04:59 PM ISTUpdated : Jan 10, 2020, 06:16 PM IST
రాజధాని తరలింపు, మూడు రాజధానులు: కేంద్రంపై పవన్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

రాజధాని తరలింపు, రైతుల ఆందోళనలపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్న దృష్ట్యా జనసేనాని అలర్ట్ అయ్యారు. 

రాజధాని తరలింపు, రైతుల ఆందోళనలపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్న దృష్ట్యా జనసేనాని అలర్ట్ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు.

Also Read:రాజధాని కోసం పవన్ మరోసారి లాంగ్ మార్చ్... ఎప్పుడంటే..

ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిస్ధితులను ఆయన నేతల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. రాజధాని తరలింపు వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన కోరారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాజధాని బాధ్యత కేంద్రంపైనే ఉందని.. అందువల్ల భారత ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Also Read:మందడంలో ఉద్రిక్తత: 'ఏపీలో ఉన్నామా, పాక్‌లో ఉన్నామా'

రాజధాని రైతులకు మాత్రం అన్యాయం జరగకూడదన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని సీఎం చేసిన ప్రకటన.. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత రాజధాని ప్రాంతాల్లో పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu