జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లాడు.
హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లాడు. గత ఏడాది పవన్ కళ్యాణ్ కరోనాబారినపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లోకి వెళ్లాడు. క్వారంటైన్ లో ఉంటూనే ఆయన పార్టీ నేతలతో ఆదివారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 12వ తేదీన తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ఃక్వారంటైన్ లోకి పవన్ కళ్యాణ్ వెళ్లడంతో ఈ ర్యాలీలో ఆయన పాల్గొనడం అనుమానమేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 17వ తేదీన తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేస్తున్నారు.ఈ స్థానం నుండి పోటీ చేయాలని జనసేన చివరి నిమిషం వరకు ప్రయత్నించింది. కానీ చివరకు ఈ స్థానంలో తామే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది.
ఈ స్థానంలో విజయం కోసం వైసీపీ, టీడీపీ, బీజేపీలు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. గతంలో రెండు దఫాలు ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. దీంతో ఈ స్థానంలో విజయంపై ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలో వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొంది. విపక్షాలు గెలుచుకొన్న స్థానాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంపీ ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.