తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తాము ఓటమి పాలైతే వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికను తాము రెఫరెండంగా స్వీకరిస్తున్నామని ఆయన ప్రకటించారు.
తిరుపతి: తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తాము ఓటమి పాలైతే వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికను తాము రెఫరెండంగా స్వీకరిస్తున్నామని ఆయన ప్రకటించారు.
ఆదివారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైతే ఆ పార్టీకి చెందిన ఎంపీలతో చంద్రబాబునాయుడు రాజీనామా చేయిస్తారా అని ఆయన సవాల్ విసిరారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆయన విమర్శించారు.చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని ఆయన ఆరోపించారు.
undefined
బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకంటే బీజేపీ మరింత దిగజారి ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారుఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను . రెండు కళ్లుగా చూస్తున్నామని ఆయన తెలిపారు. వేలాది కోట్లు ఖర్చు చేసి రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కుటుంబాలు ఆర్ధికంగా ఎదిగాయన్నారు. సీఎం జగన్ రుణం తీర్చుకొనేందుకు తిరుపతి ఓటర్లకు ఇది ఒక అవకాశమని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి తమకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్న జగన్ రుణాన్ని తీర్చుకోవాలని ఆయన కోరారు.