
రిషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పును కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అతికిస్తారా అని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విట్టర్ లో సెటైరికల్ ట్వీట్ చేశారు. రిషికొండ తవ్వకాల్లో వైసీపీ గవర్నమెంట్ నిబంధనలను అతిక్రమించందని ఆరోపించారు.
యూకేలో భారత వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోండి - రిషి సునక్ తో ప్రధాని నరేంద్ర మోడీ
‘‘చెట్లు, కొండలు, కోస్తా మండలాలు, మడ అడవులను నరికివేయడం వైసీపీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం. రిషికొండను నాశనం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీ తేల్చింది. వైసీపీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేక రుషికొండ గ్రీన్ మ్యాట్ పై 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తుందా? ’’ అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
రిషికొండ తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది అంటూ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ, జనసేన నాయకుడు మూర్తి పోయిన సంవత్సరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది అనేక విడతల్లో విచారణకు వచ్చింది. రిషికొండ ప్రాంతంలో కేవలం తొమ్మిది ఎకరాలలో తవ్వకాలనే నిబంధనలు ఉన్నాయని, కానీ ఆ నిబంధనలు వైసీపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషన్ లో తెలిపారు. దాదాపు 20 ఎకరాల్లో తవ్వకాలు జరిపిందని అందులో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. దీనిపై పూర్తి స్థాయి పరిశీలన జరపాలని కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యుల కలిగిన ఈ కమిటీ పిటిషనర్లు చేసిన అభియోగాలు నిజామా కాదా అనే కోణంలో విచారణ జరిపింది. దీని కోసం క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యటించారు. ఈ క్రమంలో ఇటీవల పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ తమ నివేదికను హైకోర్టుు అందించారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.