చంద్రబాబు, జగన్‌లపై పవన్ ఫైర్..."కవాతు ఎందుకు చేపట్టామంటే"

By Arun Kumar PFirst Published Oct 16, 2018, 6:33 PM IST
Highlights

దవళేశ్వరం బ్యారేజిపై చేపట్టిన కవాతు బలప్రదర్శన కాదని...ప్రభుత్వానికి భాద్యతని గుర్తు చేసేందుకు ప్రజలు చేసిన హెచ్చరిక అని జనసైన అధ్యక్షుడు పవన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జనసైనికులతో రాజమహేంద్రవరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...కవాతుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  దాదాపు పది లక్షల మంది కవాతుకి వచ్చి బ్యారేజి మీద నడిచారు. వారు సారా పాకెట్ల కోసమో, పలావ్ ప్యాకెట్ల కోసమో రాలేదని దోపిడీ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు హెచ్చరించడానికి వచ్చారన్నారు.

దవళేశ్వరం బ్యారేజిపై చేపట్టిన కవాతు బలప్రదర్శన కాదని...ప్రభుత్వానికి భాద్యతని గుర్తు చేసేందుకు ప్రజలు చేసిన హెచ్చరిక అని జనసైన అధ్యక్షుడు పవన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జనసైనికులతో రాజమహేంద్రవరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...కవాతుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  దాదాపు పది లక్షల మంది కవాతుకి వచ్చి బ్యారేజి మీద నడిచారు. వారు సారా పాకెట్ల కోసమో, పలావ్ ప్యాకెట్ల కోసమో రాలేదని దోపిడీ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు హెచ్చరించడానికి వచ్చారన్నారు.

కేవలం అధికార పక్ష నాయకులే కాదు ప్రతిపక్ష నేతలు కూడా బాధ్యతగా మెలగాలని పవన్ సూచించారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక చేస్తానంటే ఎలా? అని పరోక్షంగా జగన్ ను ప్రశ్నించారు. నాయకుల్లో జవాబుదారీతనం ఉండాలని...ఆ జవాబుదారితనాన్ని గుర్తుచేయడానికే కవాతు నిర్వహించినట్లు తెలిపారు.   శాంతి భద్రతలకు విఘాతం కలిగినపుడు, సమాజంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినపుడు, చాలా బలమైన చర్యల్లో భాగంగానే మిలటరీ మాత్రమే కవాతు నిర్వహిస్తుందని....తామూ అలాగే నిర్వహించామన్నారు. 

మన రాజకీయ నాయకులు రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటే సమస్యే ఉండదని పవన్ అన్నారు. కానీ వాటిని వక్రీకరించేందుకు, అతిక్రమించేందుకు రకరకాల పరిస్థితుల్లో వ్యక్తిగత లబ్ధి కోసం అన్వయించినపుడు సమస్య తీవ్రమవుతుందన్నారు. వ్యవస్థ, కులాలు, మతాలు, ఆశ్రిత పక్షపాతం మధ్య నలిగిపోవడం వల్లే ప్రజలు రోడ్డు మీదకు వస్తారని వివరించారు. మేనిపెస్టోను మరిచి గంటకోకటి, గడికొక మాట మారుస్తూ ఇష్టం వచ్చినట్లు చేస్తాం అంటే ప్రజలు చోద్యం చూస్తూ కూర్చోరు. చొక్కాలు పట్టుకుని నిలదీస్తారని చెప్పడానికే కవాతు నిర్వహించిరనట్లు పవన్ వివరించారు. 

గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసే కాటన్ బ్యారేజి నిర్మించినందుకే ప్రజలు విదేశీయుడైనా కాటన్ దొరను గుండెల్లో పెట్టుకున్నారని...చంద్రబాబు కూడా పోలవరం విషయంలో ప్రజల గుండెల్లో నిలుస్తారో లేదో చూడాలన్నారు. కాటన్ దొర కాంట్రాక్టులు తీసుకుని, బడ్జెట్ పెంచి కేవీ రావు లాగా కాలిపోర్నియాలో ద్రాక్షతోటలు తీసుకోలేదని అన్నారు. 

తెలుగువాడినని చెప్పడానికే పంచెకట్టులో కనిపించినట్లు పవన్ తెలిపారు. మన వ్యవస్థ, మన జాతి, సంప్రదాయాలను కాపాడటానికే ఈ వేషధారణ అన్నారు. అందరూ చూసే వ్యక్తి  పాటిస్తే ఆ పంచకట్టుకు గౌరవం వస్తుంది. 

ఉత్తరాంధ్ర పర్యటన త్వరగా ముగించారని...కానీ గోదావరి జిల్లాలో మాత్రం ఇన్ని రోజులు పర్యటించడానికి కారణమేమిటని చాలా మంది ప్రశ్నిస్తున్నారని పవన్ తెలిపారు. నా మూలాలున్న ప్రాంతం కావడంవల్లే ఇంత ఎక్కువ సమయం కేటాయిస్తున్నాని అన్నారు. వాటిని తెలుసుకుని, అర్థం చేసుకుని, అలవాటు చేసుకున్నానని మట్టి శక్తి, రైతు కూలీల శ్రమను అర్థం చేసుకున్నానని అన్నారు.

జనసేన కవాతు బల ప్రదర్శన కాదని అదో యుద్దమని అన్నారు. బల ప్రదర్శన చేయాల్సి వస్తే శత్రువులైనా మిగలాలి లేదా నేనైనా మిగలాలన్న పద్దతిని పాటిస్తానని అన్నారు. తాను భగవంతున్ని నమ్మానని అందువల్లే ఎవరు ఏమనుకున్న పట్టించుకోనని అన్నారు. 

 రాష్ట్రంలో తాను మార్పు కోసమే పనిచేస్తున్నానని అధికారం కోసం కాదని పవన్ స్పష్టం చేశారు. ఆ మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మెతగాలన్నారు. అస్థవ్యస్థమైన ఈ వ్యవస్థకు ఊరట కల్గించేందుకే పార్టీ పెట్టినట్లు పవన్ వ్యాఖ్యానించారు. తాను పార్టీ పెట్టినప్పుడు తన వెంట ఐదుగురు కూడా లేరని కానీ నమ్మకంతో ముందుకు వెళ్లినట్లు తెలిపారు. తుఫాను భారిన పడిన శ్రీకాకుళం కు వెళ్ళివచ్చిన తర్వాత తూర్పు గోదావరి పర్యటన ప్రారంభిస్తానని పవన్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

నేను బల ప్రదర్శన చేస్తే.. శత్రువులు మిగలరు.. పవన్

కాటన్ బ్యారేజ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతు (ఫోటోలు)

చంద్రబాబు క్లీన్‌గా బయటకు రావాలి: పవన్‌కళ్యాణ్

ధవళేశ్వరం బ్రిడ్జిపై పవన్: కవాతులో కదం తొక్కిన జనసైనికులు

పవన్ కళ్యాణ్‌కు షాక్: ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరణ

కవాతులో పాల్గొండి.. మీ కుటుంసభ్యులను గుర్తుపెట్టుకోండి: పవన్ ట్వీట్

 

click me!