పోలవరంలో ప్రతీ సోమవారం చంద్రబాబు క్యాట్ వాక్ షో:కన్నా

Published : Oct 16, 2018, 05:26 PM IST
పోలవరంలో ప్రతీ సోమవారం చంద్రబాబు క్యాట్ వాక్ షో:కన్నా

సారాంశం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా పోలవరం నిర్మాణానికి బీజేపీ కంకణం కట్టుకుందని తెలిపారు. సబ్‌ కాంట్రాక్టుల్లో కమీషన్లు, దళిత, గిరిజనుల భూముల పేరుతో టీడీపీ దోచుకుంటుందని ఆరోపించారు. 

గుంటూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా పోలవరం నిర్మాణానికి బీజేపీ కంకణం కట్టుకుందని తెలిపారు. సబ్‌ కాంట్రాక్టుల్లో కమీషన్లు, దళిత, గిరిజనుల భూముల పేరుతో టీడీపీ దోచుకుంటుందని ఆరోపించారు. పోలవరం పేరుతో ప్రతి సోమవారం చంద్రబాబు క్యాట్‌వాక్‌లు చేస్తున్నారని కన్నా ఎద్దేవా చేశారు.

కేంద్రం ఇస్తున్న నిధులన్నీ టీడీపీ స్వాహా చేస్తోందని...జన్మభూమి కమిటీ మెుదలు చంద్రబాబు వరకు దోచుకుంటున్నారని విమర్శించారు. రాజధానికి రైతులిచ్చిన భూములతో చంద్రబాబు, లోకేష్‌లు వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 2014లో ఏ కాంగ్రెస్‌ పార్టీని బాబు తిట్టాడో 2019లో అదే కాంగ్రెస్‌ పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడ‌నం.. ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu