ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ ప్లాన్:పవన్ కళ్యాణ్ ఫైర్

By narsimha lodeFirst Published Oct 17, 2022, 5:53 PM IST
Highlights

 ప్రజలు,ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు  వైసీపీ  ప్రయత్నాలు చేస్తుందని జనసేన చీఫ్ పవన్  కళ్యాణ్  ఆరోపించారు. ప్రజలకు ఏం అవసరమో నిర్ణయాలు చేయకుండా  గర్జనల పేరుతో సభలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.
 
అమరావతి:ప్రజలకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు చేయడం మానేసి గర్జనలు నిర్వహిస్తున్నారని   వైసీపీ  సర్కార్ పై జనసేన చీఫ్  పవన్  కళ్యాణ్   విమర్శలు గుప్పించారు.విశాఖపట్టణం నుండి  మంగళగిరిలోని పార్టీ  కార్యాలయానికి పవన్ కళ్యాణ్  సోమవారం సాయంత్రం  చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన  మీడియాతో మాట్లాడారు.

అమరావతి గురించి  మాట్లాడొద్దనే  ఈ గర్జనంతా అని పవన్ కళ్యాణ్  చెప్పారు..ప్రభుత్వంలో  ఉంటూ గర్జనలు,కూతలు ఏమిటీ అని  ఆయన  ప్రశ్నించారు.మూడు రాజధానులు ముందుకు వెళ్లడం లేదనే వైసీపీ ఈ ఎత్తుగడ వేసిందని పవన్  కళ్యాణ్ విమర్శించారు.ప్రాంతాలు,కులాలుగా  ప్రజల మధ్య  చీలిక  తెస్తున్నారని పవన్ కళ్యాణ్  చెప్పారు.

Latest Videos

ఒక పార్టీ ఓ కార్యక్రమం పెట్టుకుంటే  దానికి ఎదురెళ్లే ఉద్దేశ్యం  తమకు లేదన్నారు. విశాఖ గర్జనకు ముందే విశాఖలో జనవాణికి వెళ్లేందుకు తాము టికెట్లను బుక్  చేసుకున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.  అమరావతిపై వైసీపీది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒకమాట అధికారంలోకి వచ్చాక మరోమాటఅని పవన్  కళ్యాణ్ మండిపడ్డారు.వైసీపీ మాదిరిగా తాము మాట మార్చే  వ్యక్తులం  కాదన్నారు.వైసీపీ  ప్రభుత్వంపై నిర్మాణాత్మకవిమర్శలు చేస్తామన్నారు. తమ పార్టీ అంతర్గత విషయాలను  వైసీపీకి ఎందుకు చెబుతామని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

విశాఖలో తనకు  స్వాగతం  పలికేందుకు ఏర్పాటు చేసిన రిసెప్షన్  కమిటీకి  చెందిన 14  మందిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజలను  భయపెట్టి కంట్రోల్  చేయాలని చూస్తున్నారన్నారు.వైసీపీ తాటాకు చప్పుళ్లకు ,ఉడత ఊపులకు భయపడేది లేదని పవన్ కళ్యాణ్  తేల్చి చెప్పారు.

హింస జరగాలని  వైసీపీ  కోరుకుంటుందన్నారు. కోనసీమలో  వైసీపీ కార్యకర్తలే మంత్రి విశ్వరూప్ ఇంటి నుండి దగ్దం చేశారన్నారు.ఈ ఘటనను తమపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు.ఈ ప్రయత్నాన్ని తాము   సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టుగా  పవన్  కళ్యాణ్ చెప్పారు. సీఐఎస్ఎప్   ఆధీనంలో ఉన్న  ఎయిర్  పోర్టులో కి  వెళ్లి  జగన్  పై  కోడికత్తితో  దాడి చేసిన ఘటనపై ఇంకా ఎందుకు తేల్చలేదో  చెప్పాలన్నారు. ఎయిర్  పోర్టులో తమ పార్టీ  క్యాడర్ ను రెచ్చగొట్టేలా వ్యవహరించారని  పవన్ కళ్యాణ్ ఆరోపంచారు.మంత్రుల కాన్వాయ్  కు రక్షణ ఎందుకు లేదని  పవన్  కళ్యాణ్  ప్రశ్నించారు.

తనను, తన కుటుంబ సభ్యుల్ని కూడ వైసీపీ నేతలు  దూషించారని  పవన్  కళ్యాణ్  చెప్పారు.అయినా కూడా తాను సంయమనం పాటించినట్టుగా తెలిపారు. విశాఖలో  తన  కారుపై  కూర్చొని   ఐపీఎస్ అధికారి వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.

also ead: మమ్మల్నిచంపాలనే ఉద్దేశ్యంతో విశాఖలో దాడి:జనసేనపై మంత్రి రోజా ఫైర్r

విశాఖలో తమకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేకే వైసీపీ దాడి డ్రామా ఆడిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.వైసీపీ నేతలు మాత్రం  పార్టీ  ఆఫీసులపై దాడులు చేస్తే కేసులు మాత్రం పెట్టలేదన్నారు. 

click me!