
రాజధాని ప్రాంతం సీడ్ క్యాపిటల్ పరిధిలోని ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్ధాపన చేయనున్నారు. ఈనెల 28వ తేదీని శంకుస్ధాపనకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
లింగాయపాలెం, రాయపూడి గ్రామాల పరిధిలోని 950 ఎకరాల్లో ఈ భవన సముదాయాల నిర్మాణం జరుగుతుందని సిఆర్ డిఏ అధికారులు చెప్పారు. శంకుస్ధాపన కార్యక్రమం కోసం ప్రభుత్వం 100 ఎకరాలను చదును చేయిస్తోంది. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సిఆర్ డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.