
వైసీపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి తప్పకుండా జైలుకెళ్లుతాడని జ్యోసం చెప్పారు మంత్రి ఆదినారాయణరెడ్డి. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమీ భయంతో జగన్ పిచ్చేక్కి నోటికొచ్చింది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ చానేల్‌తో మాట్లాడుతూ జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఆదినాయణ రెడ్డి. జగన్ ఒక సారి జైలుకెళ్లినా బుద్ది రాలేదని విమర్శించారు. 2019 ఎన్నికల నాటికి ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. జగన్ ఎప్పుడు కలల్లో విహారిస్తారని, ఆయన అధికారంలోకి వచ్చి నంద్యాలను అభివృద్ధి చేయడమనేది కలేనని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ ఎన్నీ కుట్రలు చేసిన విజయం మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేశారు