అయోమయంలో వామపక్షాలు

Published : Aug 12, 2017, 04:45 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
అయోమయంలో వామపక్షాలు

సారాంశం

ఉపఎన్నికలో తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయమని సిపిఐ, సిపిఎం పార్టీల రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ తాజాగా పిలుపునిచ్చారు.

నంద్యాల ఉపఎన్నికలో వామపక్షాలు విచిత్రమైన పాత్రను పోషిస్తున్నాయ్. ఒక విధంగా అయోమయంలో ఉన్నట్లే కనిపిస్తోంది. ఉపఎన్నికలో తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయమని సిపిఐ, సిపిఎం పార్టీల రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ తాజాగా పిలుపునిచ్చారు. ఇక్కడే వామపక్షాల ఆలోచనేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే, నంద్యాల ఉపఎన్నికలో వామపక్షాల తరపున అభ్యర్ధులెవరూ పోటీ చేయటం లేదు. పోనీ ఎవరితోనన్నా పొత్తుందా అంటే అదీ లేదు.

వారు పోటీ చేయనపుడు, ఎవరితోనూ పొత్తు లేనపుడు జనాలు ఎవరికి ఓటు వేస్తే మాత్రం వారికేంటి నష్టం? టిడిపికి ఓటు వేయద్దని చెబుతున్నారే గానీ ఫలానా పార్టీకి ఓటు వేయమని చెప్పటం లేదు. వాళ్ళు నమ్ముకున్న పవన్ కల్యాణ్ నిండా ముంచారు. పోనీ జగన్ తో అన్నా పొత్తు పెట్టుకున్నారా అంటే అదీ లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చినందుకు జగన్ తో కూడా కటీఫ్ చెప్పేసారు.  అలాగని కాంగ్రెస్ తో పోలేరు. మరి, తక్షణ కర్తవ్యం ఏంటి? వారికే అర్ధం కావటం లేదు ఏం చేయాలో. మొత్తానికి వామపక్షాలు విచిత్రమైన పరిస్ధితిలో ఇరుక్కున్నాయన్న విషయం మాత్రం అర్ధమవుతోంది. ఆ పరిస్ధితిలో నుండి ఎప్పటికి బయటపడతాయో ఏంటో?

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్