సీఎం చంద్ర‌బాబుకు ఉండాల్సిన ఆ రెండు లేద‌ట‌..!

Published : Aug 12, 2017, 05:07 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
సీఎం చంద్ర‌బాబుకు ఉండాల్సిన ఆ రెండు లేద‌ట‌..!

సారాంశం

చంద్రబాబు, మంచితనం, మానవత్వం రెండు లేవని ఆరోపించారు కాకాణి నంద్యాల ఉప ఎన్నికల్లో తన రాజకీయ కుట్రలకు పదును పెట్టారని ఆరోపణ. టీడీపీ శ్రేణులు నంద్యాల్లో పెట్రేగి పోతున్నాయని ఎద్దేవా.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి "మంచిత‌నం, మాన‌వ‌త్వం" లేనే లేవ‌ని ఆరోపించారు వైసీపి ఎమ్మేల్యే  కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి. నోటితో నీతి ప‌నుల్లో నీతిమాలిన వ్య‌వ‌హారాలు చేసే వ్య‌క్తి చంద్ర‌బాబు అని ఆయ‌న‌ ధ్వ‌జ‌మెత్తారు. నంద్యాల్లో చంద్ర‌బాబు మైండ్‌గేమ్ ప్రారంభించార‌ని కాకాణి శనివారం మీడియా స‌మావేశంలో విరుచుకుప‌డ్డారు.

టీడీపీని తోడు దొంగ‌ల పార్టీగా అభివ‌ర్ణించారు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి. నంద్యాల ఎన్నిక‌లు అనివార్యం కాగానే బాబు త‌న రాజ‌కీయ కుట్ర‌ల‌కు ప‌దును పెట్టారని ఎద్దేవా చేశారు. పుట్టిన చిన్న పిల్లాడి నుండి ముస‌లావిడ వ‌ర‌కు మోసం చేసే ఘ‌నుడు బాబు అని ఆరోపించారు. సొంత డ‌బ్బుతో నంద్యాల్లో రోడ్లు వేస్తున్న‌ట్లు బాబు డ్రామాలు ఆడుతున‌న్నార‌ని ఎద్దేవా చేశారు. బాబు ఆదేశాల‌తోనే పోలీసులు నంద్యాల్లో బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని ఆరోపించారు. అధికార బ‌లంతో నంద్యాల్లో టీడీపీ శ్రేణులు పెట్రేగి పోతున్నార‌ని ఆయ‌న పెర్కొన్నారు.

చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమ‌న‌లు చెయ్య‌కున్నా అభివృద్ది ప‌నులు చేసిన‌ట్లు క‌ల‌రింగ్ ఇస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. బాబు త‌న కుటుంబీకుల‌కు త‌ప్ప ఏ ఒక్క‌రికి సాయం చెయ్య‌లేద‌ని, కావాలంటే ఒక‌సారి ఆత్మ‌ప‌రిశీల‌ను చేసుకోవాల‌ని సూచించారు.బాబుకు నంద్యాల్లో ఓట‌మీ భ‌యం ప‌ట్టుకుంద‌ని అందుకే క్యాబినేట్ అంతా ప్ర‌చారానికి దించార‌ని ఈ సంధ‌ర్భంగా పెర్కోన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu