రాష్ట్రమంతా వైసీపీ జెండాలే..అదిరిపోయిన జగన్ వ్యూహం

Published : Oct 26, 2017, 05:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రాష్ట్రమంతా వైసీపీ జెండాలే..అదిరిపోయిన జగన్ వ్యూహం

సారాంశం

వచ్చే ఆరు నెలల పాటు రాష్ట్రంలో వైఎస్సాఆర్ సిపి జెండాలు రెపరెప లాడటానికి వైసీపీ భారీ ప్లానే వేసింది. నవంబర్ 6వ తేదీ నుండి 180 రోజులు అంటే 2018, ఏప్రిల్ నెల వరకూ ‘ప్రజా సంకల్ప యాత్ర’తో రాష్ట్రం మొత్తం చుట్టేయాలన్నది జగన్ వ్యూహం.

వచ్చే ఆరు నెలల పాటు రాష్ట్రంలో వైఎస్సాఆర్ సిపి జెండాలు రెపరెప లాడటానికి వైసీపీ భారీ ప్లానే వేసింది. నవంబర్ 6వ తేదీ నుండి 180 రోజులు అంటే 2018, ఏప్రిల్ నెల వరకూ ‘ప్రజా సంకల్ప యాత్ర’తో రాష్ట్రం మొత్తం చుట్టేయాలన్నది జగన్ వ్యూహం.

అందుకు తగ్గట్లే పార్టీ నేతలు కూడా రోడ్ మ్యాప్ ను సిద్దం చేసారు. 125 నియోజకవర్గాల్లో పాదయాత్ర రూపంలోను మిగిలిన 50 నియోజకవర్గాలను బస్సులోనూ తిరుగుతారు. అయితే 3 వేల కిలోమీటర్లను పాదయాత్రతోనే కవర్ చేస్తారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద మొదలయ్యే యాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది.

యాత్ర జరిగినంత కాలం రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండాలు రెపరెపలాడేలా నాయకత్వం పెద్ద వ్యూహాన్నే రచించింది. అందేంటంటే, జగన్ పాదయాత్ర చేసే జిల్లాలో ఎటుతిరిగి నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తారన్న  విషయం అందరికీ తెలిసిందే.

ఉదాహరణకు కడప జిల్లానే తీసుకుంటే జగన్ ఇపుపులపాయలో యాత్రం మొదలుపెట్టగానే మొత్తం ఇడుపులపాయంతా వైసీపీ జెండాలు, బ్యానర్లు, జగన్ కటౌట్లతో నిండిపోతుంది.

అయితే మిగిలిన జిల్లా పరిస్ధితేంటి ? అంటే, జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో కూడా జెండాలు, బ్యానర్లు, జగన్ కటౌట్లకు అదనంగా ఆయా నియోజకవర్గాల్లోని నేతల కటౌట్లు కూడా భారీగా ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు ముందుగా జరుగుతున్న భారీ పార్టీ కార్యక్రమం బహుశా ఇదే కావచ్చు. అందుకనే ఇంత భారీగా, వ్యూహాత్మకంగా కార్యక్రమాన్ని జగన్ చేపడుతున్నారు.

అదే పద్దతిలో జగన్ పాదయాత్ర చేస్తున్న జిల్లాతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా జెండాలు, కటౌట్లు, బ్యానర్లు, స్ధానిక నేతల కటౌట్లతో రాష్ట్రం మొత్తం హోరెత్తిపోనున్నది. ఇందుకోసం ప్రతీ జిల్లాలోనూ లక్షలకొద్ది జెండాలు, కోట్లాది బ్యానర్లు, పోస్టర్లు, వేలాది కటౌట్ల తయారీకి ఆర్డర్లు ఇచ్చారట. పార్టీ గురించి ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఆరుమాసాల పాటు జనాలు మాట్లాడుకునేలా చేసే విషయంలో మొత్తానికి జగన్ వ్యూహం మాత్రం అదిరిపోయింది కదూ?

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu