పట్టిసీమ నీళ్లను సముద్రంలోకి వదిలారు: గుట్టు విప్పిన జగన్

First Published Mar 7, 2017, 8:17 AM IST
Highlights

కోట్ల కరెంటు బిల్లు కట్టి పట్టిసీమ నీళ్లు సముద్రంలోకి వదిలారు : జగన్ సంచలన  ఆరోపణ

పట్టిసీమ నుంచి తీసుకువచ్చిన గోదావరి  జలాలను సముద్రంలోకి తోడారు... ఇది జగన్ బయటపెట్టిన సంచలన విషయం.

 

పట్టిసీమ నీళ్లు పారిది రాయలసీమలోకి కాదు సముద్రంలోకి  ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక కొత్త విషయం వెల్లడించారు.

 

ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ సంచలన విషయం చెప్పారు. పట్టిసీమ గురించి  చాలా అసక్తి కరమయిన విషయాలు జగన్ వెల్లడించారు.

 

పట్టిసీమ పండగ  ఎంత ఘనంగా జరిగిందో మనం చూశాం. పట్టిసీమ మోటార్లు ఆన్ చేసి నీళ్లు తోడి ఎంత హంగామా చేశారో   కూడా చూశాం. అయితే, ఇది అంతా మోసమని  ఈ రోజు ఆయన చెప్పిన విషయాల వల్ల అర్థమవుతుంది. కేవలం పండగ చేసుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టేందుకు పట్టిసీమను ఎలా వాడుకున్నారో తొలిసారి జగన్ వ్యాఖ్యలతో బయటపడింది.

ప్రజలంతా చూసేందుకు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా తోడిన నీళ్లు తోడిన మాట నిజమే.  అయితే , ప్రకాశం బ్యారేజీలో  ఆ నీటిని  నిల్వచేసేందుకు జాగా లేక, సముద్రంలోకి వదలారని జగన్ వెల్లడించారు.

 

"పట్టి సీమద్వారా గోదావరి నుంచి ఎన్ని నీళ్లు తోడారో కూడా ప్రభుత్వ కచ్చితంగా చెప్పకుండా తప్పుదారి పట్టిస్తున్నది. నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా 54 టిఎంసిలు తొడామంటున్నారు. ప్రాజక్టు సూపరింటెండెంటు ఇంజనీర్ మాత్రం తోడింది  48 టిఎంసిలు మాత్రమే అంటున్నారు. పోనీ తోడిన నీళ్లు ఎక్కడి పోయాయి.  ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రం లోకి వదిలారు. ఇలా 55 టిఎంసిల నీళ్లను సముద్రంలోకి వదిలారు. కరెంటు బిల్లుల ప్రకారం ఈ నీళ్లు తోడేందుకు  135 కోట్ల రుపాయాలు ఖర్చుచేశారు.  135 కోట్లు కరెంటు బిల్లు కట్టి పట్టీసీమ నీళ్లను సముద్రంలోకి వదిలారు. 110 రోజులు నీళ్లు తోడింది సముద్రంలోకి వదిలేందుకా?" అని జగన్ ప్రశ్నించారు.

 ఈ డబ్బును తెలంగాణాలో ఆంధ్రప్రాజక్టుల కింద మునిగిపోతున్న  గ్రామాల ప్రజల పునరావాసానికి  ఆ ప్రభుత్వానికి ఇచ్చి ఉండవచ్చుగా,అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఈ సమయంలో మంత్రి దేవినేని పరోక్షంగా సముద్రంలోకి నీటిని వదిలిన సంగతి అంగీకరించారు. అయితే, సముద్రంలోకి వదలిన నీళ్లు పట్టిసీమ వి కావని, పులిచింతల నుంచి వచ్చినవని  మంత్రి మరొక విషయం బయటపెట్టారు.

 

‘పులిచింతల నుంచి వరదనీరు వస్తున్నందున, పట్టి సీమ మోటార్లు ఆఫ్ చేశాం’అని మంత్రి చెప్పారు.

 

పట్టిసీమ నుంచి 56 టిఎంసిలు తోడారని, ఇందులో పశ్చిమ గోదావరి మెట్టభూములకు 8 టిఎంసిలు, ప్రకాశం బ్యారేజీలోకి 48 టిఎంసిలు వదిలామని చెప్పారు.

 

అయితే,జగన్ మరొక కోణం బయటపెట్టారు.

 

‘ ఈ వ్యవహారం అంతా 11 2  రోజుల వ్యవధిలోనే జరిగింది. పట్టిసీమ కరెంటుబిల్లులు కట్టిన సమయంలో , పులిచింతల నీళ్లు వదిలామంటున్నారు. ఎలా సాధ్యం. పట్టిసీమ నీళ్లను గోదావరి నుండి తెచ్చి ప్రకాశం బ్యారేజీ లో వదిల అక్కడి నుంచి సముద్రంలోకి వదిలారు,’ అని జగన్ చెప్పారు.

 

దీనిమీద విచారణ చేసి వాస్తవం  ప్రజల ముందు పెట్టేదెవరు?

click me!