
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ మీద ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేడు తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు.
కోడెల అనుసరిస్తున్న విధానాన్ని తప్పపట్టారు.
జగన్ పోలవం గురించి మాట్లాడేందుకు సభలో స్పీకరే స్వయంగా ప్లీజ్ అంటూ అపోజిషన్ లీడర్ చూస్తూ మాట్లాడండని పిలిచి అనుమతిచ్చారు. అయితే, ఆయన పోలవ.... అని బోతుండగానే స్పీకర్ నుంచి ప్లీజ్ కంక్లూడ్ ( దయచేసి ముగించండి) అనడం జగన్ కు చికాకు తెప్పించింది.
‘ఏమధ్యక్షా మొదలుపెట్టకముందే కంక్లూడ్... కంక్లూడ్ అంటున్నారు. అపక్కేమో ఎంత మందితోనో మాట్లాడిస్తారు. మంత్రేమో అరగంట మాట్లాడతాడు. టాపిక్ వినాలనే ఓపిక కూడా మీలో లేకపోతే ఏ రకంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తార ధ్యక్షా.నేను చెప్పేది వింటే రాష్ట్రానికేదయిన మేలు జరిగే అవకాశం వుందేమో తెలుస్తుంది.
అపుడు స్పీకర్ ‘కమ్ ఇన్ ఎ ఢిపరెంట్ ఫాం’ అంటూ సలహ ఇచ్చారు.
అయితే, జగన్ ఆగలేదు. వినడానికి కొంత ఒపిక తెచ్చుకోండని అధికార పక్షానికి కొక సలహ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక కొత్త సంప్రదాయం కనిపిస్తుంది. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు కొంత సమయం ఇస్తారు. తీరామాట్లాడేపుడు అధికార పక్షం నుంచి చెయ్యెత్తిన ప్రతి సభ్యునికి, మంత్రికి జగన్ కు అడ్డు తగ్గిలేందుకు అవకాశం ఇస్తారు. అవకాశం వచ్చిన సభ్యుడు అలా మాట్లాడుతూ పోతుంటాడు. ఇలా ప్రతిపక్ష నాయకుడికి పది నుంచి ఇరవై సార్లు అటంకం కలుగుతూనే ఉంటుంది. అప్పటికీ మాట్లాడుతుంటే మైక్ కట్టవుతుంది. ప్రతిపక్షనాయకుడి నోటికి ఇలా తాళం వేయడం ఎక్కడా జరగదు. ఇదెక్కడ కనిపించదు. ఆంధ్రలో నే ఉంది.
‘మనిషన్నాక ఏదైనా చెబితే కాస్తైనా విశ్వసించేలా ఉండాలి.. కానీ అసలు మీ మాటల్లో మీకే నమ్మకం లేదు. సిన్సియారిటీ లేదు.. అసలు మీరు మంత్రులుగా ఉండటమే రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం’అని చివరకు విసుక్కోవలసి వచ్చంది.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే పోలవరంకు ఎక్కువ చేశారని, అపుడు సుమారు 5,555కోట్లు ఖర్చు చేసిన విషయం గుర్తు చేస్తూ టిడిపి వచ్చాక, మూడేళ్లలో, మూడు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి గొప్పగా చెప్పుకోవడం మీకే చెల్లిందని అన్నారు.