తనకు అండగా ప్రజలున్నారు

Published : Apr 07, 2017, 10:08 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
తనకు అండగా ప్రజలున్నారు

సారాంశం

తనపై గడచిన పదేళ్ళుగా కేసులున్నాయి కాబట్టి విచారణలు కొత్తమీ కాదన్నారు. చంద్రబాబు లాంటి వాళ్ళు తనను ఏమీ చేయలేరని పైన దేవుడున్నాడు, తనకు అండగా ప్రజలున్నారంటూ ధీమా వ్యక్తం చేసారు.

ఇపుడు కొత్తగా చంద్రబాబు లాంటి వాళ్ళు చేయగలిగేదేమీ లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు.నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సిపిఐ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, రాజాలను కలిసారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పదేళ్ల క్రితమే తనపై తప్పుడు కేసులు పెట్టారన్నట్లుగా వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ పార్టలో ఉన్నంత కాలం లేని కేసులు పార్టీనుండి బయటకు వచ్చిన తర్వాతనే ఎందుకు వచ్చాయని మీడియాను ప్రశ్నించారు. నిజమే కదా? తప్పు చేసినట్లు రుజువు కాకపోతే 3 నెలల కన్నా జైల్లో పెట్టేందుకు లేకపోయినా 16 మాసాలు పాటు జైల్లో ఉంచారని మండిపడ్డారు. కాంగ్రెస్, చంద్రబాబు కలిసి చేసిన కుట్రలో భాగమే తనపై కేసులుగా జగన్ స్పష్టం చేసారు.

జగన్ బయటెక్కడా కనబడకపోతే వాళ్లకి ఇబ్బందులుండవన్న కారణంతోనే తనపై అనేక కేసులు బనాయించినట్లు జగన్ చంద్రబాబు పై ధ్వజమెత్తారు. కాబట్టి తనపై గడచిన పదేళ్ళుగా కేసులున్నాయి కాబట్టి విచారణలు కొత్తమీ కాదన్నారు. చంద్రబాబు లాంటి వాళ్ళు తనను ఏమీ చేయలేరని పైన దేవుడున్నాడు, తనకు అండగా ప్రజలున్నారంటూ ధీమా వ్యక్తం చేసారు అంతకు ముందు జగన్ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తదితరులను కూడా కలిసారు. 

PREV
click me!

Recommended Stories

బీజేపీచేస్తున్న కుట్రను ఎదుర్కోడానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాం | YS Sharmila | Asianet News Telugu
Varudu Kalyani Comments on Pawan Kalyan: డైలాగ్స్ వద్దు చర్యలు తీసుకోండి | Asianet News Telugu