జగన్... ఇకనుండి జెఎంఆర్

First Published Nov 3, 2017, 3:56 PM IST
Highlights
  • రాజకీయాలన్నాక ఎన్నో సెంటిమెంట్లుంటాయి.
  • వాహనాల నెంబర్లు ఒకేలా ఉండేట్లు చూసుకోవటం, కొందరైతే నెంబర్లలో సరి సంఖ్య, బేసిసంఖ్యను కూడా చూసుకుంటారు.

రాజకీయాలన్నాక ఎన్నో సెంటిమెంట్లుంటాయి. వాహనాల నెంబర్లు ఒకేలా ఉండేట్లు చూసుకోవటం, కొందరైతే నెంబర్లలో సరి సంఖ్య, బేసిసంఖ్యను కూడా చూసుకుంటారు. అటువంటిదే సంఖ్యాశాస్త్రం ప్రకారం (న్యూమరాలజీ) పేర్లలో మార్పులు కూడా. సెలబ్రిటీలలోనే కాకుండా రాజకీయ నేతల్లో కూడా ఈ నమ్మకం పెరుగుతున్నట్లే కనబడుతోంది. తాజాగా మొదలైన ప్రచారం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన పేరులో మార్పులు చేసుకున్నారట.

అంటే జగన్మోహన్ రెడ్డి అని తీసేసి ఇంకేదో పేరు పెట్టుకోవటం కాదు. పేరునే పలికే విధానంలో మార్పులు చేసుకున్నారట. ఇప్పటి వరకూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ వైఎస్ జగన్ అని, జగన్ అని పిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంటువంటిది ఇక నుండి పై రెండు పేర్లతో కాకుండా కేవలం జెఎంఆర్ అనే పిలుచుకోవటానికి ఇష్టపడుతున్నారట.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అందరూ వైఎస్సార్ అని వైఎస్ అనే పిలుస్తారు. అదే పద్దతిలో తనను కూడా ఇకనుండి అందరితో జెఎంఆర్ అని పిలిపించుకోవాలనే జగన్, సారీ జెఎంఆర్ డిసైడ్ అయ్యారట. మరో మూడు రోజుల్లో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమవుతున్న విషయం అందరకీ తెలిసిందే కదా? ఆ సందర్భంగా నేతలు, శ్రేణులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లలో జెఎంఆర్ అనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

 

click me!