
ఆంధ్రప్రదేశ్ రాష్ఠ్రంలో పెన్షన్ లో పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగా చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎలక్షన్ కంటే ముందు ఊరూరా తిరిగి పెన్షన్లు రూ.3 వేలు చేస్తానని వైసీపీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి రూ.250 చొప్పున పెంపు అంటూ మెలికపెట్టారని ఆరోపించారు.
నిరంకుశ, నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి - అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
వైసీపీ ప్రభుత్వం చెప్పిన విధంగా చేసినా కూడా 2022 సంవత్సరం నాటికే రూ.3 వేల పెన్షన్ అందాలని అచ్చెన్నాయుడు అన్నారు. కానీ తీరా ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో పెన్షన్ రూ.3 వేలు చేస్తున్నామని చెబుతున్నారని విమర్శించారు. ఇప్పుడే కేబినేట్ లో ఆమోదిస్తున్నామని హడావిడి చేయడం సిగ్గుచేటని అన్నారు. రూ.3 వేల హామీపై మాట తప్పడం వల్ల ఒక్కో పెన్షన్ దారుడు రూ.32 వేలు నష్టపోయారని తెలిపారు.
గవర్నర్ ప్రసంగం కొత్తగా ఏం లేదు.. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లే ఉంది - కడియం శ్రీహరి
ఇదేనా పేదలపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని అచ్చెన్నాయడు ప్రశ్నించారు. ఇదేనా పెన్షన్ దారులపై శ్రద్ధ అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ ఏడాది సగటు బడ్జెట్ రూ.1.41 లక్షల కోట్లు మాత్రమే అయినప్పటికీ రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేసిందని చెప్పారు. ఐదేళ్లలో రూ.1,800 పెంచిందని చెప్పారు. కొత్తగా 20 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసిందని అన్నారు. వృత్తి కార్మికులకు కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిందని తెలిపారు.
నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..
ట్రాన్స్ జెండర్లకు కూడా తమ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసిందని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ సగటు ఏడాది బడ్జెట్ రూ.2.29 లక్షల కోట్లకు పైగా ఉందని తెలిపారు. అయినప్పటికీ ఐదేళ్లలో పెంచిన పెన్షన్ మొత్తం కేవలం రూ.750 మాత్రమే అని ఆయన విమర్శించారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం అందజేసిన ట్రాన్స్ జెండర్స్, బ్రాహ్మణ పెన్షన్లను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.
లోక్ సభలో భద్రతా ఉల్లంఘన.. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా అరెస్టు..
ఇంట్లో ఒక్కరికి మాత్రమే పెన్షన్ అంటూ వైసీపీ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నోటీసులు పంపించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే రూ.3 చొప్పున పెన్షన్ అందించేవారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలను మాయ మాటలతో ఎక్కవ కాలం మోసం చేయడం సాధ్యం కాదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు.