జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే న‌వ్వుతారు

Published : Sep 03, 2017, 02:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే న‌వ్వుతారు

సారాంశం

మంత్రి నక్క ఆనంద్ బాబు జగన్ పై తీవ్ర ఆరోపణలు. సీఎం సీటు ఆశ తప్ప ప్రజలకు మంచి చేయాలన్న కోరిక లేదు. వైసీపీ నేతలు సేఫ్ జోన్ చూసుకుంటున్నారు.

వారానికోసారి కోర్టుకెళ్లే వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కి వెళ్లి పాద‌యాత్ర చేస్తాను అంటే న‌వ్వుతార‌ని మంత్రి ఆనంద‌బాబు ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ కి ముఖ్య‌మంత్రి సీటు పై ఆశ త‌ప్ప ప్ర‌జ‌ల‌పై మ‌మ‌కారం లేద‌న్నారు. రాష్ట్ర‌ ప్ర‌జ‌ల అభివృద్ది కొరుకునే వాడైతే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌ను అడ్డ‌కోవ‌డం ఎంట‌ని ఆనంద బాబు ప్ర‌శ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న జ‌గ‌న్ పై ధ్వ‌జ‌మెత్తారు.

ఏపీకి పట్టిన అతిపెద్ద శని జ‌గ‌న్‌ అని మంత్రి విమర్శించారు. నంద్యాల, కాకినాడ ఫలితాలతో జగన్‌లో మార్పురాలేదని, జ‌గ‌న్ వైఖరి కార‌ణంగా వైసీపీ నేతలు సేఫ్‌ జోన్‌ చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోటస్‌పాండ్‌కు త్వరలో టులెట్‌ బోర్డు పెట్టడం ఖాయమని ఆనందబాబు జోస్యం చెప్పారు. అప్ప‌టికి కూడా జ‌గ‌న్ మార‌డ‌ని ఆయ‌న విమర్శించారు.

 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి 

ఐపీఎల్ ప్ర‌సార హక్కులకు భారీ డిమాండ్ గురు...

 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ
AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu