
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపధ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముద్రగడ అరెస్టుపై చంద్రబాబునాయుడను నిలదీసారు. కాపులకు రిజర్వేషన్ కోసమే కదా ముద్రగడ ఉద్యమం చేస్తున్నది అంటూ ప్రశ్నించారు. రిజర్వేషన్ కల్పిస్తానన్నది కూడా పోయిన ఎన్నికల్లో మీరే కదా? అంటూ చంద్రబాబును నిలదీసారు. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని అడిగితే కూడా అరెస్టులు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై అరెస్టులు, హౌస్ అరెస్టులు, బైండోవర్లు ప్రయోగిస్తారా అంటూ ధ్వజమెత్తారు. వేలమంది పోలీసులను మోహరించటం ద్వారా ‘తప్పు చేస్తున్నారు బాబూ’ అంటూ జగన్ ట్వీట్లో హెచ్చరించటం గమనార్హం.