కెఇః చంద్రబాబు వల్లే నిద్రపట్టటంలేదు

First Published Mar 7, 2017, 7:11 AM IST
Highlights

రాయలసీమ మొత్తం మీద చంద్రబాబుకు బిసిలే కనబడలేదా అని నిలదీసారు.

శాసనమండలి టిక్కెట్ల కేటాయింపు టిడిపిలో చిచ్చు రేపుతోందా? జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపిస్తోంది. ఉదయం నుండి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత జెఆర్ పుష్పరాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. పుష్పరాజ్ అనుచరులు టిడిపిలో వద్దని గట్టిగా ఒత్తడి పెడుతున్నట్లు సమాచారం. అలాగే, ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి బాహాటంగానే చంద్రబాబును తప్పుపడుతున్నారు.

 

రాయలసీమ మొత్తం మీద చంద్రబాబుకు బిసిలే కనబడలేదా అని నిలదీసారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తన తమ్ముడు కెఇ ప్రభాకర్ కు అన్యాయమే జరుగుతోందని వాపోయారు. ఈ విషయంలో తన సోదరునికి సర్దిచెప్పలేక తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట....పాపం. తన కుటుంబానికి తప్ప టిక్కెట్టు జిల్లాలో ఎవరికి ఇచ్చినా టిడిపి గెలవదని కూడా జోస్యం చెప్పారు. అంటే కెఇ ఉద్దేశ్యంలో ఏ టిక్కెట్టైనా ముందు తన కుటుంబానికే ఇవ్వాలనేమో. మరి జిల్లాలోని మిగిలిన నేతలెందుకున్నట్లు? పార్టీలో ఇటువంటి టి కప్పులో తుఫాన్లను గతంలో చాలా చూసాం. మరి ఈసారి ఏమవుతుందో చూద్దాం.

 

‘గుమ్మడికాయల దొంగ లాగ’ వెంటనే కెఇ వ్యాఖ్యలపై జెసి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తన మేనల్లుడు దీపక్ రెడ్డికి చంద్రబాబు ఎందుకు మూడో టిక్కెట్టు ఇచ్చారో తనకేం తెలుసని అమాయకంగా ప్రశ్నించారు. అనంతపురం జిల్లా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో దీపక్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. దీపక్ రెడ్డికి టిక్కెట్ కోసం జెసి సోదరులు చంద్రబాబుపై బాగా ఒత్తిడి పెట్టి సాధించుకున్నారు. అందుకే జెసి ప్రభాకర్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారు.

 

  

click me!