
మొత్తానికి చంద్రబాబునాయుడును వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 420ని చేసేసాడు. కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు పార్టీ కండువా కప్పుకునే సందర్భంలో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు పాలన మొత్తం మోసాలేనని ఎద్దేవాచేసారు. అందుకు ఉదాహరణగా చంద్రబాబు పుట్టింది 4వ నెల 20వ తేదీ అని చెబుతూనే రెండిటిని కలిపితే 420 వస్తుందని అన్నారు. చంద్రబాబు పాలనకు 420 సరిగ్గా సరిపోతుందన్నారు. తర్వాత చంద్రబాబు చేస్తున్న మోసాలను, పాలనలోని దుర్మార్గాలను ఎండగట్టారు. చంద్రబాబు పాలన దుర్మార్గపూపు పాలన అయితే, రాబోయేది రాజన్న సన్మార్గపు పాలనగా అభివర్కణించుకున్నారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలతో పాటు ఆయన పాలనను కూడా వచ్చే ఎన్నికల్లో జనాలు బంగాళాఖాతంలో కలిపేస్తారంటూ చెప్పారు. తన అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కూడా తకట్టు పెట్టగలడని ‘ఓటుకునోటు’ కేసు ద్వారా చంద్రబాబు రుజువు చేసుకున్నాడని జగన్ మండిపడ్డారు. అదే సందర్భంలో ముస్లింలకు చంద్రబాబు మోసిం చేసాడంటూ ధ్వజమెత్తారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా మళ్ళీ ముస్లింలను చంద్రబాబు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
మొన్నటి ప్లీనరీ సందర్భంగా తాను ప్రకటించిన నవరత్నాల గురించి కూడా జగన్ క్లుప్తంగా ప్రస్తావించారు. వైఎస్ పాలనలో పేదలకు, మహిళలకు, విద్యార్ధులకు ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను గుర్తుచేసారు. తాను అధికారంలోకి వస్తే మళ్ళీ పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో దుర్మార్గులకు, మోసగాళ్ళకు మాత్రమే స్ధానముంటోందంటూ మండిపడ్డారు.
సామాన్య జనాలను ఏమాత్రం పట్టింకోవటం లేదన్నారు. మొత్తం మీద జగన్ స్పీచ్ ఎన్నికల ప్రసంగంలాగే సాగింది. అంతుకుముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు గురువారం వైసీపీలో చేరారు. విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు.