ప్రభుత్వాధికారైన సింధు

Published : Jul 27, 2017, 06:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ప్రభుత్వాధికారైన సింధు

సారాంశం

డిప్యూటీ కలెక్టర్‌ గా సింధు క్రీడాకారుల ప్రోత్సాహానికేనన్న చంద్రభాబు

 
 ఈరోజు నుంచి పీవీ సింధు ప్రభుత్వాధికారి. స్టార్ షట్లర్   సింధును డిప్యూటీ కలెక్టర్‌ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింధుకు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడానికే సింధుకు గ్రూప్ 1  ఉద్యోగం అందించారు. గతంలో రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధుకు ఇచ్చిన ఉద్యోగ హామీ నేటితో నెరవేర్చుకున్నానని ఆయన గుర్తు చేశారు. 
పీవీ సింధు మాట్లాడుతూ సీఎంకు దన్యవాదాలు తెలిపారు.అయితే తన తొలి ప్రాధాన్యత బ్యాడ్మింటన్‌కేనని, తర్వాతే తనకు ఏదేనా అని సింధు తెలిపారు. తాను క్రీడలపైనే ఎక్కువ దృష్టి సారించనున్నట్లు ఆమె స్పష్టం  చెశారు.   భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారని సూచించారని సింధు తెలిపారు.
ఇప్పటికే అమరావతిలో పీవీ సింధుకు వెయ్యి గజాల స్థలం, రూ.3 కోట్ల నగదును ఏపీ ప్రభుత్వం అందించిన  విషయం తెలిసిందే. ఇపుడు సింధుకు అందించిన ఉద్యోగం ద్వారా తన హామీని పూర్తి చేసుకున్నానని,అందుకు తనకు ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు | AP Telangana Rain Alert
Nara Lokesh Sensational Comments On YS Jagan | Chandrababu | Asianet News Telugu