వైసీపీ స్ధాయి చాటేందుకే భారీ ప్లీనరీ

First Published Jul 7, 2017, 1:32 PM IST
Highlights

రాజధానిప్రాంతంలో ప్లీనరీని భారీఎత్తున నిర్వహిస్తేనే పార్టీస్ధాయిని బాగా పెంచుకున్నట్లవుతుంది. అదే ఇడుపులపాయలో అయితే, తనంతట తానుగా పార్టీ స్ధాయిని తగ్గించుకున్నట్లే. అందులోనూ ఇంతవరకూ విజయవాడ ప్రాంతంలో పెద్దఎత్తున జరిపిన పార్టీకార్యక్రమాలు కూడా పెద్దగాలేవు. అందుకనే నియోజకవర్గాలు, జిల్లాల స్ధాయిలో జరిగిన ప్లీనరీలను కూడా అట్టహసంగా నిర్వహించాలని జగన్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్లీనరీలకు బాగానే ప్రచారం వచ్చింది.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహత్మకంగానే పార్టీ ప్లీనరీని భారీగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ ఇడుపులపాయలో మాత్రమే నిర్వహించే ప్లీనరీని విజయవాడ-గుంటూరు మధ్యలోని నాగార్జునయూనివర్సిటీ ఎదురుగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందేకదా? నిజానికి ఇంత భారీగా ప్లీనరీని నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ నిర్వహిస్తున్నారు. కారణాలేంటి?

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇటు టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో పాటు అటు వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా  అభ్యర్ధుల ఎంపిక కసరత్తులో బిజీగా ఉన్నారు. అందులోనూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది మనమే అని జగన్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు. ఈ నేపధ్యంలోనే నేతల్లో సరైన భరోసా నింపేందుకు కూడా ఈ ప్లీనరీని జగన్ వాడుకుంటున్నారు.

రాజధానిప్రాంతంలో ప్లీనరీని భారీఎత్తున నిర్వహిస్తేనే పార్టీస్ధాయిని బాగా పెంచుకున్నట్లవుతుంది. అదే ఇడుపులపాయలో అయితే, తనంతట తానుగా పార్టీ స్ధాయిని తగ్గించుకున్నట్లే. అందులోనూ ఇంతవరకూ విజయవాడ ప్రాంతంలో పెద్దఎత్తున జరిపిన పార్టీకార్యక్రమాలు కూడా పెద్దగాలేవు. అందుకనే నియోజకవర్గాలు, జిల్లాల స్ధాయిలో జరిగిన ప్లీనరీలను కూడా అట్టహసంగా నిర్వహించాలని జగన్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్లీనరీలకు బాగానే ప్రచారం వచ్చింది.

సరే, ప్లీనరీ ఖర్చంటారా జగన్ అవస్తలు పడతారనుకోండి అది వేరే సంగతి. పార్టీలో ఉన్న మోతుబరులు తలా ఓ చెయ్యి వేస్తే ఖర్చు మొత్తం తేలిగ్గా అయిపోతుంది. మూడు రోజుల ప్లీనరీ కారణంగా నేతలు, శ్రేణుల్లో కూడా ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇదే జోష్ మరో రెండేళ్ళు నిలపాలంటే భారీ కార్యక్రమాలు జరపాలన్నది జగన్ వ్యూహం. అందుకే ఖర్చుకు వెనకాడటం లేదు. ఈ విషయం మీదే ఇంటెలిజెన్స్ విభాగం కూడా ప్లీనరీ ఏర్పాట్లపై పూర్తి దృష్టి పెట్టిందట.

click me!