కర్నూలు: టిడిపిలో కొత్త టెన్షన్

First Published Mar 15, 2017, 9:08 AM IST
Highlights

ఎంఎల్ఏ హఠాన్మరణంతో అనుచరులందరూ అటు శిల్పపైన ఇటు చంద్రబాబు మీద మండిపడుతున్నారు.

తెలుగుదేశంలో కొత్త టెన్షన్ మొదలైంది. కర్నూలు జిల్లాలో స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నిక విజయంపై అసలే టిడిపిలో అనుమానాలున్నాయి. దానికి తోడు నంద్యాల నియోజకవర్గం ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో  అనుమానాలు కాస్త టెన్షన్ గా మారింది. భూమా మరణించిన రోజు నుండి ఎంఎల్ఏ అనుచరులలో అత్యధికులు తమ ఎంఎల్ఏ మృతికి చంద్రబాబే కారణమని బాహాటంగానే చెబుతున్నారు. దాంతో అత్యధికులు చంద్రబాబు అంటే మండుతున్నారట.

ఈ ప్రభావం మూడు రోజుల్లో జరుగనున్న ఎంఎల్సీ ఎన్నికలపై ఫ్రభావం చూపే అవకాశాలున్నట్లు టిడిపి నేతలు అనుమానిస్తున్నారు. స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధుల్లో భూమాకు కూడా మద్దతుదారులున్నారు. ఇపుడు వారంతా ఏం చేస్తారన్న విషయంలో టిడిపిలో అయోమయం నెలకొంది. అసలే ఎంఎల్సీ అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డికి భూమాకు ఏమాత్రం పడదు. శిల్పాకు మద్దతు ఇవ్వటానికి భూమా ఇష్టపడలేదు.

అటువంటిది చంద్రబాబు ఒత్తిడి మీదే చక్రపాణికి పనిచేయటానికి అంగీకరించారు. అటువంటిది తమ ఎంఎల్ఏ హఠాన్మరణంతో అనుచరులందరూ అటు శిల్పపైన ఇటు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. తండ్రిపోయిన బాధలో ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ అఖిలప్రియ ఏమేరకు ఎన్నికల్లో పాల్గొనేది అనుమానమే. దాంతో ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లోని భూమా అనుచరులు శిల్పాకు ఎక్కడ హ్యాండ్ ఇస్తారోనన్న కొత్త టెన్షన్ మొదలైంది టిడిపిలో.

click me!