రుణమాఫీ: ఎప్పటికయ్యేను ?

Published : Mar 15, 2017, 11:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
రుణమాఫీ: ఎప్పటికయ్యేను ?

సారాంశం

ప్రభుత్వ ధోరణి చూస్తుంటే ఎన్నికల సంవత్పరం కోసమే రుణమాఫీలను పెండింగ్ పెట్టుకున్నట్లు కనబడుతోంది.

రుణమాఫీకి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు చూస్తుంటే మాఫీ  ఎప్పటికవుతుందో ఎవరూ చెప్పలేకున్నారు. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే ఎన్నికల సంవత్పరం కోసమే రుణమాఫీలను పెండింగ్ పెట్టుకున్నట్లు కనబడుతోంది. రాష్ట్ర విభజనకు ముందు ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు ఎన్నో హామీలను ఇచ్చారు. అప్పట్లో ఆయన ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ విలువే సుమారు లక్ష కోట్ల రూపాయలు. అయితే, ఎన్నికల్లో అధికారం అందగానే రుణమాఫీ లెక్క విచిత్రంగా సుమారు 35 వేల కోట్లకు తగ్గిపోయింది.

 

ఎన్నికల సమయంలో జనాలను ఆకర్షించేందుకు టిడిపి కాకిలెక్కలు చాలా చెప్పింది. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, చేనేతలకు మాఫీ ఇలా చాలా చెప్పింది. అయితే, అధికారంలోకి రాగానే అంతుకు ముందు చెప్పిందానికి విరుద్ధంగా చేస్తోంది. ఇందులో భాగమే తాజా బడ్జెట్ లో రుణమాఫీకి రూ. 3600 కోట్ల కేటాయింపు. ఇప్పటికి రెండు విడతలు మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి. అసలు ప్లస్ వడ్డీని ఒకేసారి కట్టలేక ప్రభుత్వం విడతలవారీ విధానాన్ని ఎంచుకున్నది.

 

రెండు విడుతల్లో చెల్లించింది సుమారు రూ. 10 వేల కోట్లే. ఇంకా చేయాల్సింది సుమారుగా 25 వేల కోట్లుటుంది. ఇపుడు కేటాయించినట్లు రూ. 3600 కోట్లు కేటాయిస్తే ఎప్పటికి రైతు రుణమాఫీ పూర్తవుతుందో భగవంతుడికే తెలియాలి. రూ. 50 వేల లోపు రుణాలున్న వారిలో అత్యధికులు రుణమాఫీలో లబ్దిపొందినట్లు తెలుస్తోంది. లక్షకు పైగా రుణాలున్న దాదాపు 20 లక్షల రైతుకుటుంబాలు మాఫీ కోసం ఎదురుచూస్తున్నాయ్. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను బ్యాంకులు రుణవడ్డీలకే జమచేసుకుంటున్నాయి. ఈ పరిస్ధితుల్లో రైతు రుణమాఫీ అంశం మిథ్యగా తయారైంది. ఇదిలావుండగా డ్వాక్రా రుణాల మాఫీ కాక మహిళా సంఘాలు, చేనేత రుణాలు మాఫీ కాక చేనేతలు ఇబ్బందులు పడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?